బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి

brahmani
Spread the love

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిరాశతో కనిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ పట్ల అసంత్రుప్తిగా ఉన్నారు. పార్టీ నాయకులతో వరుస భేటీలతో రాజకీయాలలో రకరకాల ఊహాగానాలకు తెరలేపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణి మాత్రం భిన్నంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని కొనియాడారు. ముందుచూపుతో తయారుచేసిన బడ్జెట్ గా అభిప్రాయపడ్డారు.

విశాఖలో జరిగిన ఓ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ బడ్జెట్ అద్భుతం అన్నట్టుగా ప్రశంసించారు. బడ్జెట్‌లో డైరీ, ఆక్వాతోపాటు వ్యవసాయ రంగాలకు పెద్ద పీటవేయడం శుభపరిణామం అని బ్రాహ్మణి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని చెప్పారు. డైరెక్టర్ లిస్టెడ్ కంపెనీ బోర్డులో మహిళ సభ్యురాలిగా ఉండాలని 2013లో తప్పనిసరి చేయడం శుభపరిణామం అని ఆమె తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

మొత్తంగా తెలుగుదేశం నేతల తీరుకి, అధినేత కోడలి తీరుకి వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు రాజకీయంగా స్పందిస్తే, బ్రాహ్మణి వ్యాపారవేత్తగా తనకు కలిగిన ప్రయోజనాల గురించి మాత్రమే చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన దశలో ఇలాంటి వ్యాఖ్యలు ఆసక్తిగా మారుతాయనడంలో సందేహం లేదు.


Related News

varma

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

Spread the loveజీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగాRead More

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *