ఒంటరయిపోయిన గంటా

ganta
Spread the love

ఏపీ మంత్రి గంటా ఒంటరిగా మారిపోయారు. సొంత గడ్డ విశాఖలో ఆయనకు సహకరించే వారే లేకుండా పోయారు. దాంతో విశాఖ రాజకీయాల్లో చాలాకాలంగా చక్రం తిప్పుతున్న గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా ఒంటరిగా మిగిలిపోయిన వ్యవహారం ఆశ్చర్యంగా మారింది. చర్చనీయాంశం అవుతోంది. చివరకు ఆయన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఆయన నిర్వహించిన కార్యక్రమానికి మొఖం చాటేయడం చర్చనీయాంశం అవుతోంది. రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విశాఖ ఉత్సవ్ తెచ్చిన చిచ్చుతో తెలుగుదేశం రాజకీయాల్లో కొత్త హీటు రాజుకుంది. మూడు రోజుల ఉత్సవ్ లో మొదటి రోజుల కార్యక్రమానికి కేవలం ఒక్క అనకాపల్లి ఎమ్మెల్యే మిగిలిన నేతలంతా ఢుమ్మా కొట్టేశారు.

వాస్తవానికి ఉత్సవ్ పేరుతో విశాఖలో భారీగా వసూళ్ల ప్రక్రియ సాగిందనే ఆరోపణలున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన సంస్థల నుంచి సాగించిన వసూళ్ల వ్యవహారంలో వాటాల విషయంలో వచ్చిన విబేధాలతో కొందరు దూరం అయ్యారని సమాచారం. అదే సమయంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో కొన్ని సంస్థలకు భారీగా ప్రయోజనం కలిగించేలా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పలువురిలో ఆగ్రహం కలిగించినట్టు ప్రచారం సాగుతోంది. పర్యాటక శాఖ అధికారులు కూడా ఒక్క గంటా మినహా మిగిలినవారందరినీ ఖాతరు చేయడం లేదనే అభిప్రాయం ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అన్నీ కలిసి మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని విశాఖ ఉత్సవ్ కి దూరం కావడం గంటాకి మింగుడు పడడం లేదు. కనీసం చివరిరోజయినా కొందరినీ విశాఖ ఉత్సవ్ లో కనిపించేలా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.

ఈ కార్యక్రమానికి సీఎం కూడా హాజరుకాలేదు. ఇన్చార్జ్ మంత్రి చినరాజప్ప కనీసం మొఖం కూడా చూపించలేదు. దాంతో ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టేసిన తీరుతో గంటా గొంతులో వెలక్కాయపడ్డట్టయ్యింది. ఈ పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఆరాతీసినట్టు సమాచారం.


Related News

ysrcp_1829

వైసీపీలో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఅరకు సహజంగా చల్లని ప్రాంతం. అందులోనూ శీతాకాలంలో అయితే మరింత చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు అరకుRead More

purandeshwari

పురందేశ్వరి ఫైర్

Spread the loveటీడీపీ తీరుపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. తమ పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మిత్రపక్షంRead More

 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • ఒంటరయిపోయిన గంటా
 • విరుచుకుపడిన విజయసాయిరెడ్డి
 • డెంగీ బారిన ఎంపీ
 • అనితకు ఎసరు పెడుతున్న ఆయన..!
 • గంటాను ఢీ కొట్టిన అచ్చెన్న
 • గంటాను తాకిన అందాల సెగ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *