Main Menu

మంత్రికి షాక్

Spread the love

ఏపీ మంత్రికి షాక్ తగిలింది. ఫిరాయింపు మంత్రి సుజయ క్రుష్ణ రంగారావుకి సామాన్యులు చుక్కలు చూపించారు. దాంతో మంత్రి సొంత నియోజకవర్గంలోనే అవాక్కయ్యారు. జన స్పందన చూసి ఖిన్నుడయ్యారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువలో మంత్రి సైకిల్ యాత్రను స్థానికులు అడ్డుకున్నారు. నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. ఎన్నిమార్లు సమస్య గురించి చెప్పినా పట్టించుకోకుండా ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు యాత్రలంటూ రావడం ఏంటని నిలదీశారు. అత్యవసర సమయాల్లో కూడా 108 వాహనం కూడా గ్రామంలోకి రాలేనిపరిస్థితి ఉందని, ఎంతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

అయితే మంత్రి స్పందించిన తీరు గ్రామస్తులకు మరింత మంట కలిగించింది. ఇప్పటికిప్పుడు నిధులు కేటాయింపు సాధ్యం కాదంటూ సుజయ చేతులెత్తేశారు. దాంతో గ్రామంలోని యువత మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సైకిల్ యాత్రను గ్రామంలోకి రానిచ్చేది లేదని తేల్చేశారు. దాంతో మంత్రి సైకిల్ యాత్ర ఆ గ్రామంలో అడుగుపెట్టకుండానే మరో మార్గంలో ముందుకు సాగించాల్సి వచ్చింది. ఈ వ్యవహారం సుజయకి రాజకీయంగా పెద్ద నష్టం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బొబ్బిలితో పాటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది.






Related News

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the loveఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు.Read More

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *