Main Menu

రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు

Spread the love

స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీలు ఒక‌రి ఆందోళ‌న‌ల‌కు మ‌రొక‌రు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా అడ్డ‌గించే కార్య‌క్ర‌మాలు ఉండ‌వు. అందులోనూ ఒకే అంశంపై ఉద్య‌మం అయిన‌ప్పుడు ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా పోలీసుల జోక్యంతో చ‌ల్లారిపోతుంటారు. కేవ‌లం ఫ్యాక్ష‌న్ ప్ర‌భావిత ప్రాంతాల్లో త‌ప్ప పెద్ద‌గా చేయి దాటిన సంద‌ర్భాలు ఉండ‌వు. కానీ తాజాగా ఏపీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడి వ్య‌వ‌హారం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. న‌ర్సీప‌ట్నం లాంటి ప్రాంతంలో విప‌క్షం మీద దండెత్తిన తీరు చాలామందికి విస్మ‌యం క‌లిగించింది. హోదా ఉద్య‌మంలో ఉన్న‌ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోటీ ఉద్య‌మానికి, పైగా వ్య‌తిరేక ఆందోళ‌న‌కు సిద్ధ‌ప‌డ‌డం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేసింది.

న‌ర్సీప‌ట్నంలో మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు వ్య‌వ‌హారం కొంత‌కాలంగా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణం అవుతోంది. తాజాగా వైసీపీ నాయ‌కుడు గుడివాడ అమ‌ర్ నాధ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న అనుచ‌రులు వైసీపీ మీద ఎదురుదాడికి దిగారు. అది కూడా మాట‌ల‌లో కాకుండా చేత‌ల వ‌ర‌కూ రావ‌డ‌మే కొంత క‌ల‌క‌లం రేపింది. హోదా కోసం ఆందోళ‌న చేస్తున్న వైసీపీ శిబిరం వ‌ద్ద‌కు వ‌చ్చిన అయ్య‌న్న అనుచ‌రులు వీరంగం చేశారు. రెచ్చిపోయి వ్య‌వ‌హారించారు. ఓ ద‌శ‌లో టెంటులో వైఎస్ విగ్ర‌హాన్ని తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వైసీపీ శ్రేణులు అడ్డుకోవ‌డంతో కాస్త వెన‌క్కి త‌గ్గారు. అయిన‌ప్ప‌టికీ అమ‌ర్ నాథ్ కి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ , అయ్య‌న్న‌కిక్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పోటీగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా నినాదాలు ఇచ్చే ప‌రిస్థితి రావ‌డంతో ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. చివ‌ర‌కు అయ్య‌న్న వ‌ర్గం చ‌ల్లార‌డంతో స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింది. తాత్కాలికంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. కానీ పోటాపోటీ ఫిర్యాదులు , మాట‌ల దాడి కొన‌సాగిస్తున్నారు. కానీ ఇలాంటి ప‌రిస్థితి స‌మంజ‌సం కాద‌ని ప‌లువురు చెబుతున్నారు. విప‌క్షాల శిబిరం మీద‌కు వెళ్లే ఆన‌వాయితీ మానుకోవాల‌ని సూచిస్తున్నారు.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *