Main Menu

జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!

Spread the love

కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏకంగా 40మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌నే రీతిలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు కూడా. వైసీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చాలాకాలంగా త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారంద‌రికీ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని చెప్పాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రోసారి ఫిరాయింపుల జోరు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి ప‌లువురు నేత‌లు సైకిల్ స‌వారీకి సెండాఫ్ చెప్పేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. కానీ చంద్ర‌బాబు బుజ్జ‌గింపుల‌తో ఆయ‌న వెన‌క్కి త‌గ్గినట్టు క‌నిపిస్తోంది. అదే బాట‌లో మ‌రికొంద‌రు నేత‌లు, ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా పార్టీ మారిపోయే ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. గ‌తంలో మాదిరిగా విలువ‌లు, రాజ‌కీయ సిద్ధాంతాలు అనే మాట మ‌ర‌చిపోయిన నేప‌థ్యంలో ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధి కాబ‌ట్టి, ముంద‌స్తుగా సానుకూల‌త ఉన్న పార్టీలో చోటు కోసం ఖ‌ర్చీఫ్ వేసే ఆలోచ‌న‌లో చాలామంది ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో వివిధ కార‌ణాల‌తో టీడీపీలో అసంతృప్తి గా ఉన్న నేత‌లు జ‌న‌సేన‌, వైసీపీ ల‌లో ఏదో ఒక‌టి తేల్చుకోలేక స‌త‌మ‌తం అవుతున్నార‌ని ఓ అభిప్రాయం. ముఖ్యంగా కోస్తాలోని ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం నేత‌లు కొంద‌రు చంద్ర‌బాబు తీరుతో అస‌హ‌నంగా క‌నిపిస్తున్నారు. త‌మ సామాజిక‌వ‌ర్గానికి ఇచ్చిన హామీని అమ‌లుచేయ‌క‌పోవ‌డం, త‌మ‌కు ప‌ద‌వుల విష‌యంలో ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో ర‌గిలిపోతున్నారు. విజ‌య‌వాడ కి చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవ‌ల కొంత సైలెంట్ కావ‌డం వెనుక ఇలాంటి కార‌ణాలే ఉన్నాయ‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం అన్ని పార్టీల నేత‌ల మీద బుద్ధా వెంక‌న్న విరుచుకుప‌డాల్సి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక తూర్పు గోదావ‌రిలో కూడా ఓ ఎంపీ, మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యేకి కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంద‌ని చెబుతున్నారు.

టీడీపీ ప‌నితీరు మీద పెరుగుతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎటు మ‌ళ్లుతుంద‌నే విష‌యంలోనూ, త‌మ భ‌విష్య‌త్తు ప్ర‌యోజ‌నాల విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ఇలాంటి నేత‌లు కొంద‌రు కొంత సందిగ్ధ స్థితిలో ఉన్నార‌ని చెబుతున్నారు. క్లారిటీ కోసం మ‌రికొంత కాలం వేచి చూడ‌డం ఉత్త‌మ‌మ‌నే అభిప్రాయంతో సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చూడాలి…రాజ‌కీయాలు ఎటు మ‌ళ్లుతాయో..ఇలాంటి నేత‌ల క‌న్ను ఏపార్టీపై ప‌డుతుందో..


Related News

టీడీపీ ఎమ్మెల్యేకి కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ఇక్క‌ట్లలో ప‌డ్డారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెకుRead More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు పొందిన యువ‌నేత‌

Spread the loveజ‌న‌సేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. న‌వ త‌రాన్ని రాజ‌కీయంగా ఎదిగే దిశ‌లో ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేనాని కీల‌కRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *