Main Menu

Latest Survey: విజ‌య‌న‌గ‌రం విజేత ఎవ‌రు?

Spread the love

ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోనే అతి త‌క్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా విజ‌య‌న‌గ‌రం. ఈ జిల్లాలో ప్ర‌స్తుతం 9 అసెంబ్లీ స్థానాలున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ 6 చోట్ల విజ‌యం సాధించింది. మూడు స్థానాల‌తో వైసీపీ స‌రిపెట్టుకుంది. ఆ త‌ర్వాత అనేక రాజ‌కీయ మార్పులు జ‌రిగాయి. కీల‌క నేత బొత్సా ఫ్యామిలీ వైసీపీలో చేర‌డంతో ఆపార్టీకి బ‌లం పెరిగింది.

ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వైసీపీ ఊపు ఉంటుంద‌ని ఆశించిన ఆ పార్టీ శ్రేణుల‌ను వ‌ర్గ‌పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బొత్సాని వ్య‌తిరేకించే నేత‌లు ప‌లువురు ఈసారి ఆయ‌న వ‌ర్గీయుల‌కు స‌హ‌క‌రించ‌డం లేదు. మూడు సీట్లు ద‌క్కించుకున్న బొత్సా కుటుంబం అస‌మ్మ‌తిని ఎదుర్కొంటోంది.

టీడీపీలో కూడా త‌గాదాలు త‌క్కువేమీ కాదు. కానీ ఆపార్టీకి అధికారం కార‌ణంగా ద‌క్కిన ఆర్థిక ద‌న్ను ఈసారి గ‌ట్టెక్కించ‌గ‌ల‌ద‌నే ధీమా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో కూడా టీడీపీకి మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే సానుకూల‌త క‌నిపిస్తోంది. ముఖ్యంగా బీసీ వ‌ర్గాలు ప‌లు జిల్లాల్లో టీడీపీకి దూరం కాగా విజ‌యన‌గ‌రంలో మాత్రం టీడీపీ వెంట న‌డిచేలా క‌నిపిస్తున్నారు

తాజా అంచ‌నాల ప్ర‌కారం జిల్లాలో టీడీపీ త‌న సిట్టింగు స్థానాల‌లో చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల కోల్పోవ‌డం దాదాపు ఖాయం అయ్యింది. సాలూరు మ‌రోసారి ద‌క్కించుకునేందుకు దూకుడుగా సాగుతోంది ఇక వైసీపీ సిట్టింగ్ సీటు కురుపాంలో గ‌ట్టి పోటీ ఎదుర్కొంటోంది. శ‌త్రుచ‌ర్ల‌, వైరిచ‌ర్ల కుటుంబాలు ఏకం కావ‌డంతో ఈసారి కురుపాం మీద పాల‌క‌ప‌క్షం క‌న్నేసింది. కానీ అభ్య‌ర్థి నామినేష‌న్ స్క్రూట్నీలో పోవ‌డంతో జ‌నార్థ‌న్ థాట్రాజ్ కుటుంబం నుంచి బ‌రిలో ఉన్న మ‌హిళా నేత ప్ర‌భావం మీద ప్ర‌శ్న‌లు త‌ల్లెత్తుతున్నాయి.

ఇక టీడీపీ సిట్టిగ్ స్థానాలు ఎస్ కోట‌, గ‌తంలో వైసీపీ గెలిచిన బొబ్బిలి స్థానాల‌లో ముందంజ‌లో ఉండ‌గా, పార్వ‌తీపురం, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో గ‌ట్టి పోటీ ఎదుర్కొంటోంది. విజ‌య‌న‌గ‌రంలో ముందంజ‌లో ఉంది.

జిల్లాలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి

మొత్తం స్థానాలు -9
టీడీపీ -4
వైసీపీ -3
గ‌ట్టి పోటీ -2






Related News

గంటా గెలుస్తారా?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రాజేస్తున్న సీట్ల‌లో విశాఖ నార్త్ ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటులో ఎవ‌రుRead More

Latest Survey: విజ‌య‌న‌గ‌రం విజేత ఎవ‌రు?

Spread the loveఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోనే అతి త‌క్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా విజ‌య‌న‌గ‌రం. ఈRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *