Main Menu

డెంగీ బారిన ఎంపీ

Spread the love

అరకు ఎంపీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఆమె పలుమార్లు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తాజాగా ఆమె డెంగీ జ్వరంతో బాదపడుతున్నారు. దాంతో ఎంపీ కొత్తపల్లి గీతను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోవడంతో ఆమె డెంగీ బాధితురాలిగా నిర్థారించారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. దేశరాజధానిలోనే ఆమె డెంగీ బారిన పడడం విశేషంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ ఆమె అనారోగ్యం కారణంగా సెషన్స్ కి దూరంగా ఉండాల్సి వస్తోందని కుటుంబీకులు చెబుతున్నారు.






Related News

వైసీపీ ఆశ‌లు నీరుగారిపోతాయా..!

Spread the loveవైసీపీలో అధికార ఆశ‌ల్లో ఊగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే ప‌ట్టం క‌డ‌తార‌ని ఆశిస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెద్దRead More

జ‌న‌వ‌రిలోనే ఏపీ ఎన్నిక‌లు

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో కూడా ముంద‌స్తు ఊహాగానాలు చుట్టుముడుతున్నాయి. చంద్ర‌బాబు ఇప్ప‌టికే స‌న్నాహాలు ప్రారంభించారు. తాజాగా వైసీపీ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *