Main Menu

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత కొణ‌తాల రామ‌కృష్ణ ఇప్పుడు మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. టీడీపీ శిబిరంలో కాసింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. అన‌కాప‌ల్లి రాజ‌కీయాల్లో ఇదో పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.

వాస్త‌వానికి కొణ‌తాల చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు సీటు ఖాయం చేసుకున్నారు. కానీ అంత‌లోనే అనూహ్యంగా వైసీపీ వైపు మ‌ర‌ల‌డం బాబుకి గట్టి షాక్ అనే భావిస్తున్నారు. గ‌డిచిన మూడేళ్లుగా కొణ‌తాల సైకిలెక్కే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. గంటా అడ్డంకుల‌తో అయ్య‌న్న సానుకూల ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ద‌క్కుతుంద‌ని అంతా భావిస్తున్న వేళ కొణ‌తాల యూ ట‌ర్న్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

వైసీపీ త‌రుపున ఆయ‌న అన‌కాప‌ల్లి ఎంపీగా ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉంది. మ‌రో మాజీ మంత్రి దాడి వీర‌భ‌ద్ర‌రావు కూడా మ‌ళ్లీ వైసీపీలో చేరిన త‌రుణంలో ఆయ‌న అన‌కాప‌ల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఉంది. అనకాపల్లిలో ఇద్దరికీ రాజకీయంగా అసలు పొసగదు. గత ఎన్నికల ముందు దాడి తన కుమారుడు రత్నాకర్‌తో కలిసి వైసీపీలో చేరారు. విశాఖ పశ్చిమ సీటును రత్నాకర్‌కు ఇచ్చారు. కొణతాల తమ్ముడు అనకాపల్లిలో పోటీచేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అనంతరం దాడి వైసీపీకి దూరంగా ఉండిపోయారు. టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మళ్లీ వైసీపీకి వెళ్లిపోయారు. ఈ దఫా రత్నాకర్‌కు అనకాపల్లి సీటును ఆయన ఆశిస్తున్నారు.






Related News

గంటా గెలుస్తారా?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రాజేస్తున్న సీట్ల‌లో విశాఖ నార్త్ ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటులో ఎవ‌రుRead More

Latest Survey: విజ‌య‌న‌గ‌రం విజేత ఎవ‌రు?

Spread the loveఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోనే అతి త‌క్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా విజ‌య‌న‌గ‌రం. ఈRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *