కొణతాల మళ్లీ తెరమీదకు…

Sri Konathala Rama Krishna (11)
Spread the love

మాజీ ఎంపీ, మాజీ మంత్రి కొణతాల రామక్రుష్ణ మరోసారి తెరమీదకు వస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్ డిమాండ్ తో విన్నూత్న దీక్షకు సిద్ధమవుతున్నారు. ఏకంగా రైల్లోనే దీక్ష చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకూ ఏపీ ఎక్స్ ప్రెస్ లో దీక్ష సాగించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఈ నెల 27న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో 48 గంటల పాటు నిరసన దీక్షను చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఆసుపత్రి(విమ్స్‌)ను ఎయిమ్స్‌గా మార్చడం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల అమలుకు అవసరమయ్యే నిధులన్నీ రాబోయే బడ్జెట్‌లో కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో కొణతాల ఈ వినూత్న నిరసనను చేపడుతున్నట్లు తెలిసింది.

డిమాండ్ల సాధన కోసం ఒక రాజకీయ నాయకుడు రైలులో దీక్ష చేపట్టడం ఇదే ప్రథమం. గతంలో జాతి పిత మహాత్మా గాంధీ డిమాండ్ల కోసం రైల్లో దీక్షలు చేపట్టేవారు. రైల్లో దీక్ష చేపడుతున్న తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున కొణతాల అనుచరులు కూడా పయనమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో దీక్షను ప్రారంభించి.. 29వ తేదీన ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌(మహాత్మాగాంధీ సమాధి)కు వెళ్లి దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభల ఫ్లోర్‌ లీడర్లను, ఎంపీలను కలసి సంబంధిత డిమాండ్ల సాధనకు మద్దతు కోరతారు. అలాగే కేంద్రమంత్రులను కలుసుకుని వచ్చే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులను కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేస్తారు.


Related News

varma

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

Spread the loveజీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగాRead More

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *