Main Menu

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the love

టాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏ పాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కూడా ఆయ‌న వ‌దిలిపెట్ట‌లేదు. ఏపీలో త‌న‌కు విశేష‌మైన ఫాలోయింగ్ ఉంద‌ని కేఏ పాల్ చెప్పుకున్నారు. అందులో భాగంగా త‌న ఇంట‌ర్వ్యూ ని యూట్యూబ్ లో చూసిన వారి సంఖ్య‌ను ఆయ‌న ఆధారంగా చేసుకున్నారు..

కే ఏ పాల్ త‌న ఇమేజ్ గురించి చెబుతూ . ‘‘వారం క్రితం ఓ చానెల్‌లో మాట్లాడుతూ బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పా. యూట్యూబ్‌లో ఆ వీడియోను 14 లక్షల మంది చూశారట. ఉన్న సత్యం అది. నేను ఇండియా వదిలి 30 సంవత్సరాలు అయింది. అక్కడ ఎంజిలినా జోలిని చూశారు.. షారుఖ్‌ఖాన్‌ను చూశారు.. అమితాబ్ బచ్చన్‌ను చూశారు. నేను ఆంధ్రాలో ఉన్నదే తక్కువ. తప్పా నేనన్నది?. నేను బాలకృష్ణను కలవలేదండి.. పేరు మాత్రం విన్నా.. ఆయన యాక్టరా అని అడిగా?. ఆ వీడియోనే అంత మంది చూశారు. అదే చానెల్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడితే కేవలం 5 వేలు, 10 వేలు మంది మాత్రమే చూస్తున్నారు. అంటే వాళ్లకంటే నాకు 100 రెట్ల ఫాలోయింగ్ ఉన్నట్లే కదా.. ఆయన మాట్లాడిందానికి 10 వేలు ఏంటి? నేను మాట్లాడినదానికి 14 లక్షలు ఏంటి? ఈ ఫాలోయింగ్ వల్లే 6 లక్షల మంది భీమవరం వస్తున్నారని మా సభకు మద్దతు ఇవ్వలేదు.’’ అని పాల్ పేర్కొన్నారు.

చంద్ర‌బాబు తీరుపై పాల్ మండిప‌డ్డారు. త‌న‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉండ‌డంతో చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు తనకు శాంతి సభలు పెట్టుకోవడానికి అనుమతులివ్వడం లేదంటూ ఆరోపించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదని, ఆయన ముఖ్యమంత్రి కాకముందే హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర ఉందని పాల్ చెప్పుకొచ్చారు.






Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *