Main Menu

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the love

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌ని ప్ర‌క‌టించారు. అయితే త‌న‌కు ఒక‌సారి అధికారంలోకి వ‌స్తే 30 ఏళ్లు పాలించాల‌న్న‌దే ఆశ అని తెలిపారు. ఇచ్చాపురంలో జ‌రిగిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ముగింపులో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

చంద్ర‌బాబు త‌న దోపిడీ సొమ్ముతో ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ వంచించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌న్నారు. కానీ ఆయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకున్న‌ప్ప‌టికీ జ‌నం మాత్రం ఆయ‌న‌కు ఓట్లేయ‌ర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. త‌న తండ్రితో పాటుగా త‌న ఫోటో కూడా ప్ర‌తీ ఇంటిలో ఉండాల‌న్న‌దే త‌న కోరిక అని బ‌య‌ట‌పెట్టుకున్నారు.

మూడువేల ఆరు వంద‌ల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసిన త‌న‌కు రాష్ట్రంలో అన్ని స‌మ‌స్య‌ల మీద అవగాహ‌న ఉంద‌ని, ప్ర‌తీ పేద‌వాడికి మంచి చేయాల‌న్న త‌ప‌న‌తో ఉన్నాన‌ని , అంద‌రూ క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. చెడిపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను తోడుగా ఉండ‌మ‌ని ప్రాధేయ‌ప‌డుతున్న‌ట్టు జ‌గ‌న్ కోరారు.

మ‌రో మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, ఈ ప్ర‌జా వ్య‌తిరేక‌ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపేందుకు అంద‌రూ సిద్ధం కావాల‌న్నారు. నారా సురుడు ఒక్క‌డే రాక్ష‌సుడు కాద‌ని, ఎల్లో మీడియా కూడా ఉంద‌ని, వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసే ప‌రిస్థితి ఉంద‌ని, ప‌త్రిక‌లు, చానెళ్ల‌తో కూడా యుద్ధం చేయాల్సి ఉంద‌న్నారు. ఈ మాయావి ఎన్నో పొత్తులు పెట్టుకుని మ‌ళ్లీ అన్యాయం చేయాల‌ని చూస్తార‌ని, అన్నింటినీ జ‌యించేందుకు జ‌నం తోడుండి ఆశీర్వ‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the love90Sharesరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the love9Sharesఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *