ఆంధ్రా అల్లుడు-ఐర్లాండ్ ఆట‌గాడు

636410388682743987
Spread the love

కెన్‌ డోహర్టి.. ఐర్లాండ్‌కు చెందిన అతడు 1997 వరల్డ్‌ స్నూకర్‌ చాంపియన్‌. ఇతడికీ, ఉత్తరాంధ్రకు బంధుత్వం ఉంది. ఎక్కడో ఐర్లండ్‌..ఇక్కడి ఉత్తరాంధ్రకు చుట్టరికం ఏమిటంటారా ? అవును..చాలా దగ్గరి బంధుత్వమే అదీ అల్లుడుగా. ఇంతకీ ఎలానంటే.. డోహర్టి భార్య సైరా తండ్రి డాక్టర్‌ ప్రసాద్‌ది శ్రీకాకుళం జిల్లా సోంపేట. ప్రసాద్‌ కొద్దికాలం విజయనగరంలో చదువుకుని తర్వాత వెల్లూరులో ఉన్నతవిద్యాభ్యాసం చేశారు. ప్రసాద్‌ భార్య జెస్సికా స్వస్థలం తమిళనాడు. వీరి కుమార్తె డాక్టర్‌ సైరాకు ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో ఓ స్నూకర్‌ టోర్నీ సందర్భంగా డోహర్టితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు ఆపై పెళ్లికి దారితీసింది. అలా డోహర్టి, సైరాలు 2001లో వివాహబంధంతో ఒక్క టయ్యారు. ప్రస్తుతానికొస్తే.. డోహర్టి విశాఖలో జరుగుతున్న వరల్డ్‌ ర్యాంకింగ్‌ స్నూకర్‌ టోర్నీలో ఆడుతున్నాడు. గురువారం ఇంగ్లండ్‌కు చెందిన సామ్‌ బైర్డ్‌తో అతడు తలపడ్డాడు. ఈ మ్యాచ్‌ను డోహర్టి అత్త, మామ, ఇతర కుటుంబ సభ్యులతోపాటు విశాఖలోని వారి బంధువులు హాజరయ్యారు.






Related News

vizag-south-vasupalli-ganesh-kumar-tdp-140048322520-10-1489122042

అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Spread the loveటీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏకంగా పార్టీ కార్యాల‌యం ముందు నిర‌స‌న చేప‌ట్టారు.Read More

Haribabu bjp

హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!

Spread the loveఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మారుతున్నాడు. నాలుగేళ్లుగా అనేక ప్ర‌యత్నాలు చేసినా సాధ్యం కానిది అనూహ్యంగా జ‌రిగింది.Read More

  • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
  • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
  • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
  • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
  • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
  • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
  • సిట్టింగుల‌కు షాకివ్వ‌బోతున్న బాబు
  • ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *