హుద్ హుద్ నిధులు గాలిలో..చ‌ద‌వండి…!!!

vizag_2149337g
Spread the love

వైజాగ్ లో తుఫాన్ వ‌చ్చింది. హుద్ హుద్ విధ్వంసం సృష్టించింది. భారీ న‌ష్టం మిగిల్చింది. సుంద‌ర న‌గ‌రాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కానీ చివ‌ర‌కు ప్ర‌కృతి విప‌త్తును కూడా త‌ట్టుకుని సాగ‌ర‌న‌గ‌రం నిలిచింది. దానికి హుద్ హుద్ పై విజ‌యం అంటూ చంద్రబాబు ప్ర‌చార ర్యాలీ కూడా చేప‌ట్టారు. అదంతా జ‌రిగి రెండేళ్ళు దాటిపోయినా ఆ నిధుల ప‌రంప‌ర ఆగ‌లేదు. వాటిని వినియోగించుకోవ‌డంలో బాబు మార్క్ వ్య‌వ‌హారాల‌కు కొద‌వ‌లేదు. కావాలంటే కింద జీవో చూడండి…

20525954_1957298074554122_2864853774550482619_n

హుద్ హుద్ తుఫాన్ అక్టోబ‌ర్ 2014లో వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13 నుంచి 18 వ‌ర‌కూ స్పెష‌ల్ ఫ్లైట్స్ వినియోగించిన‌ట్టు తాజాగా చంద్ర‌బాబు స‌ర్కారు 16 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసింది. తుఫాను వ‌చ్చిన రెండేళ్ల‌కు విమాన ఖ‌ర్చులు కింద అంత భారీ మొత్తంలో విడుద‌ల చేయ‌డం వెనుక అస‌లు గుట్టు అర్థ‌మ‌యితే రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ తీరు మీకు ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

వాస్త‌వానికి తుఫాన్ స‌హాయ నిధులు పేద‌ల‌కు అందాలి. అందులో జ‌రిగిన మ‌త‌ల‌బులు అన్నీ ఇన్నీ కావ‌ని వైజాగ్ వాసులంద‌రికీ తెలుసు. బాధిత మ‌త్స్య‌కారుల‌కు స‌హాయం అంద‌లేద‌ని ఇప్ప‌టికీ వాపోతున్నారు. కానీ తుఫాన్ పేరుతో చంద్ర‌బాబు ఐదు రోజుల విమాన ఖ‌ర్చుల‌కు 16 కోట్లు అంటే రోజుకి 3 కోట్ల‌కు పై మాటే వ్య‌యం చేయ‌డం విశేషంగా ఉంది. నిజంగా తుఫాన్ కోసం ఖ‌ర్చు చేస్తే 2014లో డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2016లో వ‌రుస‌గా 4 జీవోలు ఇచ్చి 16 కోట్లు విడుద‌ల చేయ‌డం వింత‌లో వింత‌గా ఉంది. బాబు పాల‌నా తీరుకి, తుఫాన్ స‌హాయ నిధుల ఖ‌ర్చుకి నిద‌ర్శ‌నంగా ఉంది.

వాస్త‌వానికి తుఫాన్ వ‌చ్చిన రోజున విశాఖ‌లో విమానాలు దిగే అవ‌కాశం లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ర‌క‌ర‌కాల మార్గాల్లో చేరుకున్న‌ట్టు చెప్పుకున్నారు. ఆయ‌న అక్క‌డే తిష్ట‌వేసి న‌గ‌రాన్ని ప‌రిశుభ్రం చేసిన‌ట్టు ప్ర‌చారం సాగింది. కానీ ఇప్పుడు రోజుకి 3 కోట్లు ఖ‌ర్చు చేసి విమానాలు తిరిగిన‌ట్టు చెప్ప‌డం అంటే నిధులు గాలిమ‌యం కావ‌డ‌మే త‌ప్ప అస‌లేం జ‌రిగింద‌న్న‌ది ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌ని వ్య‌వ‌హారంగా ఉంది. చంద్ర‌బాబుతో పాటు పాల‌నా యంత్రాంగం అంతా వైజాగ్ లో ఉంటే, చివ‌ర‌కు రాష్ట్ర‌మంతా సామాన్య ప్ర‌జ‌లు క‌దిలి స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌డితే ఇక స్పెషల్ ఫ్లైట్స్ లో ఎవ‌రు తిరిగార‌న్న‌ది అంతుబ‌ట్ట‌ని ప్ర‌శ్న‌. ప్ర‌ధాన‌మంత్రి మోడీ విశాఖ ప‌ర్య‌ట‌న‌కు కేంద్రం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చారు. ఇక చంద్ర‌బాబు వైజాగ్ లోనే ఉన్నారు. అలాంటి స‌మ‌యంలో 16 కోట్లు ఖ‌ర్చు ఎవ‌రు చేసిన‌ట్టు అనే సందేహం రాక‌మాన‌దు. అయినా ప్ర‌భుత్వం మాత్రం రెండేళ్ల త‌ర్వాత తేదీల‌తో జీవోలు జారీ చేసి నిధులు విడుద‌ల చేయ‌డంలో భారీ స్థాయిలో అక్ర‌మాలు ఉన్నాయ‌నే సందేహం రాక‌మాన‌దు. బాబు పాల‌న‌లో అవినీతి వ్య‌వ‌హారాల‌కు ఇదో నిద‌ర్శ‌న‌మా అన్న అనుమానం క‌లుగ‌క‌మాన‌దు.


Related News

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

chiru saira

వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్

Spread the loveమెగాస్టార్ చిరంజీవికి ట్రీట్మెంట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా…అయితే ప్రస్తుతం 60వ పడిలో ఉన్న చిరు తన ఆరోగ్యంRead More

 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • ఒంటరయిపోయిన గంటా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *