Main Menu

తీవ్రవాయుగుండంతో వర్షాలు

Spread the love

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు 50 కిలోమీటర్లు ఉత్తర వాయవ్యంగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితలద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎక్కువచోట్ల, రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.






Related News

వైసీపీ ఆశ‌లు నీరుగారిపోతాయా..!

Spread the loveవైసీపీలో అధికార ఆశ‌ల్లో ఊగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే ప‌ట్టం క‌డ‌తార‌ని ఆశిస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెద్దRead More

జ‌న‌వ‌రిలోనే ఏపీ ఎన్నిక‌లు

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో కూడా ముంద‌స్తు ఊహాగానాలు చుట్టుముడుతున్నాయి. చంద్ర‌బాబు ఇప్ప‌టికే స‌న్నాహాలు ప్రారంభించారు. తాజాగా వైసీపీ కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *