వైజాగ్ లో వేడి రాజేసిన నందమూరి హరికృష్ణ

ఆశ్చర్యపడకండి…నందమూరి వంశం దృష్టి ఇప్పుడు కూకట్ పల్లి వైపు ఉంది. హరికృష్ణ గారమ్మాయి సుహాసిని రంగంలో దిగడంతో ఆమె విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బ్రదర్స్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తమ సోదరికి మద్ధతు ప్రకటించారు. బాలకృష్ణ నేరుగా రంగంలో దిగి ప్రచారం కూడా నిర్వహించారు. అయినా సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో గట్టి పోటీ ఎదుర్కొంటున్న సుహాసిని పరిస్థితిపై అంతటా ఆసక్తి కనిపిస్తోంది.
ఈలోగా వైజాగ్ లో దివంగత హరికృష్ణ చుట్టూ వివాదం రాజుకుంటోంది. తెలంగాణాలో నందమూరి వంశాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందే ఆలోచనలో ఉన్న టీడీపీ, అందులోనూ నేరుగా చంద్రబాబు పాలనలో సాగుతున్న వ్యవహారం చాలామందిని విస్మయపరుస్తోంది. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ విగ్రహం ఏర్పాటు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కి జీవీఎంసీ నుంచి నోటీసులు విడుదల చేయడం వివాదంగా మారుతోంది.
యార్లగడ్డ వారితో పాటుగా పలువురు నందమూరి అభిమానులు కూడా ఈ విషయంలో ఖిన్నులయ్యారు. వైజాగ్ బీచ్ లో చాలామంది విగ్రహాలకు అనుమతులు లేవని,అయినప్పటికీ హరికృష్ణ విగ్రహం ఏర్పాటు చేయగానే అనుమతులు గుర్తుకొచ్చాయా అంటూ నిలదీస్తున్నారు. తాను విగ్రహాన్ని తొలగించే అవకాశం లేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. అందులోనూ తెలంగాణా ఎన్నికలు, నందమూరి సుహాసిని పోటీలో ఉన్న తరుణంలో సాగుతున్న పరిణామాలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
అయితే మరికొందరు మాత్రం హరికృష్ణ విగ్రహాం ఏర్పాటు మీద పెదవి విరుస్తున్నారు. వైజాగ్ చరిత్రతో ఏమాత్రం సంబంధం లేని హరికృష్ణ విగ్రహాం ఏర్పాటుని తప్పుబడుతున్నారు. రాష్ట్రమంత్రిగానూ, ఎంపీగానూ పనిచేయడమే కొలబద్ధ అయితే చాలా విగ్రహాలు పెట్టాల్సి ఉంటుందని, కానీ ఇలా అనుమతులు లేకుండా విగ్రహాలు పెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు.
Related News

టీడీపీ ఎమ్మెల్యేకి కోర్ట్ సమన్లు
Spread the loveటీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇక్కట్లలో పడ్డారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెకుRead More

పవన్ కళ్యాణ్ ప్రశంసలు పొందిన యువనేత
Spread the loveజనసేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. నవ తరాన్ని రాజకీయంగా ఎదిగే దిశలో ప్రోత్సహించేందుకు జనసేనాని కీలకRead More