Main Menu

దిగొచ్చిన సర్కారు, బోగాపురం ఎయిర్ పోర్ట్ కుదింపు

Spread the love

చంద్రబాబు సర్కారు దిగొచ్చింది. ఎట్టకేలకు లక్ష్యానికి చేరుతోంది. ఏకంగా పదిహేనువేల ఎకరాల్లో నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికి చివరకు ఐదోొ వంతు భూముల్లో సరిపెడతామని చెప్పాల్సిన స్థితికి వచ్చింది. విజయనగరం జిల్లాలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం దిగిరావడంతో కథ కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. బోగాపురం ఎయిర్ పోర్ట్ ని 2,600 ఎకరాలు సరిపోతాయని ప్రభుత్వం తేల్చింది. మిగిలిన భూములను డీ-నోటిఫై చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల ఉద్యమం,ప్రతిపక్షాల ఒత్తిడికి సర్కారు దిగొచ్చి.. డీ-నోటిఫై చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు అవసరమవుతాయని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని అమలు చేయాలని భావించింది. దీనిపై ప్రజలు, రైతులు, వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 5,311 ఎకరాల సేకరణకు 2015 ఆగస్ట్‌ 31న హడావుడిగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, 2016 జనవరిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకూ రైతుల భూముల జోలికి వెళ్లొద్దని ఈ ఆదేశాల్లో పేర్కొంది.

ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు రైతుల పోరాటం నేపథ్యంలో ఎకరా ఒక్కంటికీ రూ.33 లక్షల వరకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భూములివ్వని రైతులపై బెదిరింపు చర్యలకు పాల్పడింది. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేని మరికొందరు రైతులు భూములను వదులుకోవ డానికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం 2,600 ఎకరాలను మాత్రమే సేకరించగలిగింది. మిగిలిన రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న రైతులు కూడా తమ భూములను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. గత నోటిఫికేషన్‌లోని 1,899.9 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఈ నెల 9, 10 తేదీల్లో డీ-నోటిఫికేషన్‌ విడుదల చేసింది.






Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *