Main Menu

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the love

ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు. ఆంధ్రా యూనివర్శిటీ స్నాతకోత్సవం ఉత్సాహంగా నేరుగా వేదిక పై నుంచే గవర్నర్ కౌంటర్ వ్యాఖ్యలు చేయడంతో గంటా ఖంగుతినాల్సి వచ్చింది. గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను వేదికపైనే ఖండించడం విశేషంగా మారింది.

“ప్రభుత్వ యూనివర్శిటీలు ప్రైవేట్ యూనివర్శిటీలతో పోటీ పడాలి. రాష్ట్రానికి ఎన్నో ప్రముఖ ప్రైవేటు వర్శిటీలు వస్తున్నాయి. వాటితో పోటీ పడుతూ ప్రభుత్వ వర్శిటీలు ఎదగాలి” అని వ్యాఖ్యానించారు. ఆపై గవర్నర్ మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయవద్దని ఒకింత గట్టిగానే అన్నారు. ప్రైవేటు వర్శిటీలతో ప్రభుత్వ వర్శిటీలు పోటీపడలేవని చెప్పారు. వర్శిటీలలో నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్డీ నిబంధన పెట్టడంతో, ఎంతో మంది ఆసక్తి లేకుండానే పీహెచ్డీలు చేసేస్తున్నారని, ఒక ఆచార్యుడు ఒకేసారి ఎంతో మందితో పీహెచ్డీలు చేయించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన నరసింహన్, పరిశోధనలు సమాజానికి ఉపయుక్తకరం కావడం లేదని అన్నారు. పీహెచ్డీలను డిగ్రీలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వైద్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో, గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్వీర్యం అయ్యాయని, విద్యా వ్యవస్థకు ఆ దయనీయ స్థితి రానీయవద్దని సూచించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.






Related News

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the loveఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు.Read More

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *