వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్..?

giddi esshwari
Spread the love

రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. వైసీపీ నుంచి మరో వికెట్ పడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు సాధించిన గిడ్డి ఈశ్వర్ గుడ్ బై చెప్పే దశకు చేరుకున్నారు. పాడేరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అనేక రూపాల్లో ఒత్తిడికి తలొగ్గి ఎదురొడ్డి నిలిచిన ఈశ్వరి తాజా పరిణామాలతో అవాక్కయినట్టు చెబుతున్నారు. తనకు గిట్టని నేతలకు అందలం ఎక్కించే ప్రయత్నం సాగడాన్ని సహించలేకపోతున్నారని సమాచారం. దాంతో ఆమె కూడా చంద్రబాబు చెంతకు చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

విశాఖ ఏజన్సీలో ఇప్పటికే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వైసీసీ నుంచి గెలిచి టీడీపీలో చేరిపోయారు. తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వ విప్ అయిపోయారు. అయితే గిడ్డి ఈశ్వరి మాత్రం చంద్రబాబుకి ధీటుగా నిలబడ్డారు. గతంలో బాక్సైట్ ఉద్యమం సందర్బంగా చింతపల్లి సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేసుల వరకూ వెళ్లాయి. కానీ ఈశ్వరి మాత్రం వెనకడుగు వేయలేదు. తీరా చూస్తే ఇప్పుడు ఆమె పార్టీ మారతారనే ఊహాగానాలు విస్త్రుతంగా వినిపిస్తున్నాయి.

మాజీ ఉపాధ్యాయురాలైన ఈశ్వరి మంచి వాగ్ధాటి ప్రదర్శిస్తారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలనే ఆశతో ఆమె ఉన్నారు. అరకు ఎంపీ స్థానం మీద ఆశలు పెంచుకున్నారు. కానీ జగన్ ఆలోచన వేరుగా ఉన్నట్టు కనిపిస్తోంది. బొత్సా చక్రం తిప్పడంతో అరకు ఎంపీ సీటుకి మాజీ ఎమ్మెల్యే కంభం రవిబాబు తెరమీదకు వచ్చారు. పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా కంభం రవిబాబుని ప్రకటించడం ఈశ్వరి సహించలేకపోతున్నారు. అధినేత ద్రుష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తన దారి తాను చూసుకోవడం ఉత్తమమనే ఆలోచనకు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.

తాజాగా కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి కనపిస్తోంది. ఇటీవలే రంపచోడవరం గిరిజన మహిళా ఎమ్మెల్యే గోడదూకగా, తాజాగా గిడ్డి ఈశ్వరి కూడా అదే జాబితాలో చేరితే వైసీపీకి కొంత ఇబ్బందికరమే అని చెప్పవచ్చు.


Related News

Women_3747

గంటాను తాకిన అందాల సెగ

Spread the loveవైజాగ్ లో అందాల పోటీల వ్యవహారం హీటు రాజేస్తోంది. మహిళా సంఘాల ఆందోళనతో హాటు హాటుగా మారింది.Read More

ganta srinivas

గంటా మీద గురిపెట్టినట్టా..

Spread the loveఇదే చర్చ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి అన్యాయం చేసిన వారిపై తాను ప్రతీకారం తీర్చుకుంటానంటూ పవన్Read More

 • టీడీపీలో ఆ సీటు ఇప్పుడు హాటు
 • చంద్రబాబు నెత్తిన పాలుపోసినట్టే..!
 • రంగంలోకి జనసేనాని
 • గిడ్డి ఈశ్వరికి ఝలక్: వైసీపీలోకి కీలక నేత
 • వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్..?
 • మహిళా ఎంపీని బ్లాక్ మెయిల్ చేశారు…
 • బీసీ వర్సెస్ బీసీ
 • బీజేపీలో డూప్లికేట్ నాయకులున్నారంటున్న మంత్రి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *