Main Menu

గంటాను ఢీ కొట్టిన అచ్చెన్న

achennaidu
Spread the love

ఏపీలో మంత్రుల మధ్య విబేధాలు రోడ్డెక్కుతున్నాయి. ఇప్పటికే అయ్యన్న, గంటా మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. దానికి తోడు తాజాగా గంటా శ్రీనివాసరావుతో మరో మంత్రి ఢీ కొట్టారు. తన జిల్లాలో మంత్రి గంటా మాట సాగకుండా అడ్డుకున్నారు. దాంతో విద్యాశాఖ మంత్రి నిర్ణయానికి శ్రీకాకుళం జిల్లాలో బ్రేక్ పడింది. నేనే రాజు..నేనే మంత్రి అన్న చందంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖల్లోనూ పెత్తనం చేసే అచ్చెన్న తాజాగా డీఈవో నియామకంలో కూడ తన మాటే చెల్లాలంటూ రెగ్యులర్ డీఈవో స్థానంలో ఇన్ఛార్జ్ డీఈవోకి పీఠం అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది రాష్ట్రమంతా గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లో నియామకాలు జరగ్గా, శ్రీకాకుళంలో మాత్రం అచ్చెన్న తనకు నచ్చినట్టు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. మంత్రుల మధ్య విబేధాలు కొత్త తగాదాకు తెరలేపే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖకు సంబంధించి మంత్రి గంటా ఇచ్చిన ఆదేశాలకే గతి లేకపోవడం విశేషంగా మారింది. జిల్లా విద్యాధికారిగా గంటా నియమించిన ఓ అధికారిని చేరటానికి వీల్లేదంటూ అచ్చెన్న వెనక్కు పంపేశారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు. కలెక్టర్‌ సూచనల మేరకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను జిల్లా డీఈఓగా జాయిన్‌ కావద్దని చెబుతున్నారని, మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని సమాచారం అందింది. తాను జిల్లాలో డిప్యూటీ డీఈఓగా రెండు డివిజన్లలో పనిచేశానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చానని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని అచ్చెన్నకు విన్నవించినా ఫలితం దక్కలేదు. వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీచేయడంతో ఆ అధికారి ఇంకేమీ మాట్లాడలేకపోయారు.

అదే సమయంలో తన మనిషిగా భావిస్తున్న విజయనరగం జిల్లా డైట్‌ కాలేజీ లెక్చరర్‌ ప్రభాకరరావును మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి డీఈఓగా ఎంపిక చేసుకున్నారు. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు లేకుండానే ఆయన ఇన్‌ఛార్జిగా కొనసాగటం గమనార్హం.ఇంతకు ముందు ఏడాదిన్నర ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. కొత్త డీఈఓల నియామకం తరువాత ఆయన్ను విజయనగరం డైట్‌కు పంపినా మళ్లీ రప్పించి ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు. మరోవైపు గంటా మాత్రం రెగ్యులర్ డీఈవో ఉండాల్సిందేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల వివాదం ఎటు మళ్లుతుంందోననే చర్చ మొదలయ్యింది.


Related News

ganta

గంటా ఎపిసోడ్ లో కీల‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the love12Sharesగంటా శ్రీనివాస‌రావు ఎపిసోడ్ కి ముగింపు ప‌డిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. టీడీపీ తీరుతో అల‌క‌పాన్పు ఎక్క‌డం, అంత‌లోనే విందుRead More

ganta srinivas

గంటా గంట కొట్టేస్తారా..?

Spread the love7Sharesగంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయంగా ప్ర‌త్యేక శైలిలో సాగుతారు. విశాఖ‌లోనే కాకుండా రాష్ట్ర‌మంతా ఆయ‌న తీరు గురించి నిత్యంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *