టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..

tdp
Spread the love

అధికార పార్టీ అమాత్యుల వ్య‌వ‌హారం ఆఖ‌రికి ఉరిమి ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్ట‌వుతోంది. సామాన్య అధికారులు బ‌ల‌పశువులుగా మారుతున్నాయి. తాజాగా ఇద్ద‌రు ప‌శుసంవ‌ర్థ‌క శాఖ అధికారుల‌పై క‌లెక్ట‌ర్ చర్య‌లు తీసుకున్నారు. స‌రెండర్ చేసేశారు. విశాఖ జిల్లాలో మంత్రులు అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావు మ‌ధ్య వివాదం కొత్త మ‌లుపు తిరిగిన‌ట్ట‌య్యింది.

డీఎల్డీయే ప‌ద‌వి విష‌యంలో అయ్య‌న్న‌ను ఖాత‌రు చేయ‌కుండా గంటా మాట మేర‌కు క‌లెక్ట‌ర్ ప్ర‌వీణ్ నిర్ణ‌యం తీసుకున్నారు. గంటా అనుచ‌రుడిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చేశారు. దాంతో అయ్య‌న్న రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డారు. ఆ వెంట‌నే స్పందించిన ఇన్చార్జ్ మంత్రి చిన‌రాజ‌ప్ప ఆదేశాల‌తో క‌లెక్ట‌ర్ త‌న ఆదేశాలు వెన‌క్కి తీసుకోవాల్సి వ‌చ్చింది. కానీ ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కి, వివిధ వ‌ర్గాల నుంచి అందిన ఉత్త‌ర ప్ర‌త్తుత్య‌రాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను అయ్య‌న్న వ‌ర్గీయులు బ‌య‌ట‌పెట్టారు.

దాంతో ఈ లేఖాంశాలు ప‌బ్లిక్ కావ‌డంతో క‌లెక్ట‌ర్ ఖంగుతినాల్సి వ‌చ్చింది. అయ్య‌న్న‌ను బేఖాత‌రు చేస్తూ ఏక‌ప‌క్షంగా గంటా వ‌ర్గానికి పెత్త‌నం అప్ప‌గించ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్టు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మ‌రోసారి క‌ల‌క‌లం రేపుతోంది. ఈ లేఖ‌ల‌న్నీ బ‌య‌ట‌కు రావ‌డానికి కొంద‌రు అధికారులే కార‌ణ‌మ‌ని క‌లెక్ట‌ర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జేడీ, ప‌శుగ‌ణాభివృద్ధి సంస్థ ఈడీల‌ను ఆయ‌న ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో దున్న‌పోతుల త‌గాదాలో లేగ‌దూడ‌ల కాలు విరిగిన‌ట్ట‌య్యింద‌ని జిల్లా వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.


Related News

TDP MLA Anitha

అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!

Spread the loveఏపీలో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల జాబితాలో వంగ‌ల‌పూడి అనిత ఒక‌రు. గ‌తంలో ఉపాధ్యాయురాలుగా ప‌నిచేసి, టికెట్ సాధించిన తొలిసారేRead More

27-vzgnrns1-Ani+28ONGPG6-ANITA.jpg

అనిత అవుట్..?

Spread the loveఅనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న చందంగా మారుతోంది టీడీపీ ప‌రిస్థితి. గ‌డిచిన కొంత‌కాలంగా చంద్ర‌బాబు ఆశించిన దానికి భిన్నంగా ప‌రిణామాలుRead More

 • అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు
 • హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!
 • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
 • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
 • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
 • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
 • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
 • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *