Main Menu

గంటా సంచ‌ల‌న నిర్ణ‌యం; మారిపోతున్నారు!

Spread the love

ఏపీ మంత్రి గంటా త‌న ఆన‌వాయితీని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ పార్టీ, సీటు మార్చే సంప్ర‌దాయం పాటిస్తున్న గంటా శ్రీనివాస‌రావు ఈసారి పార్టీ మారినా లేక‌పోయినా సీటు మాత్రం మారాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా మ‌రోసారి భీమిలో బ‌రిలో ఉండాల‌ని ఆయ‌న భావించిన‌ప్ప‌టికీ ఆవంతి శ్రీనివాస్ వ్య‌వ‌హారంతో ఆయ‌న‌కు ఎస‌రు త‌ప్పేలా లేదు. ఈ నేప‌థ్యంలో నెల్లిమ‌ర్ల మీద గురిపెట్టిన గంటాకి అక్క‌డి ప‌రిణామాలు కూడా మింగుడుప‌డ‌డం లేదు.

దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంట్ బ‌రిలో దిగే ఆలోచ‌న‌కు గంటా వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా విశాఖ‌లో జ‌రిగిన టీడీపీ ముఖ్య నేత‌ల స‌మావేశంలో ఈ చ‌ర్చ ముందుకు రావ‌డం ఆస‌క్తిగా మారుతోంది. స‌మావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో నగర పరిధిలోని ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌, పి.గణబాబు, పల్లా శ్రీనివాసరావుతోపాటు పార్టీ రూరల్‌ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.

జిల్లాలోని విశాఖపట్నం, అనకాపల్లి స్థానాల్లో ఒకటి బీసీకి ఇస్తే మరొకటి కాపులకు కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది. అభ్యర్థులపైనా చర్చ జరిగింది. విశాఖ లోక్‌సభ స్థానానికి కాపు సామాజిక వర్గానికి ఇవ్వదలిస్తే మంత్రి గంటా శ్రీనివాసరావు, బీసీ అయితే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరు ప్రస్తావనకు వచ్చాయి. అయితే దివంగత నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు శ్రీభరత్‌ విశాఖ సీటు ఆశిస్తున్నారు. కానీ గంటా క‌న్నుప‌డ‌డంతో లోకేష్ తోడ‌ల్లుడి ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయ‌న్న‌ది సందేహంగా మారుతోంది.

ఇక అనాక‌ప‌ల్లి ఎంపీ సీటు నుంచి బీసీ అయితే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తన కుమారుడు విజయ్‌కు టిక్కెట్‌ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు ఎప్పటినుంచో అధిష్ఠానాన్ని కోరుతున్నారు. దాంతో ఆయ‌న్న త‌న‌యుడి ఆశ‌లు నెర‌వేరుతాయా అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే. ఇక ఇదే స‌మావేశంలో బిగ్ బాస్ విజేత కౌశ‌ల్ పేరు కూడా ముందుకొచ్చింది. కానీ విశాఖ సీటుని బీసీకి కేటాయిస్తే అన‌కాప‌ల్లిలో కాపు నేత‌ల పేర్లు తెర‌మీద‌కు రావ‌చ్చ‌ని చెబుతున్నారు. ఏమ‌యినా గంటా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని పార్ల‌మెంట్ వైపు మ‌ళ్లీ అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంటే అది చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది.


Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *