Main Menu

గంటాకి ఆల్ ‘క్లియ‌ర్’

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో మంత్రి గంటా ఈసారి ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ సీటు మారుస్తూ వ‌స్తున్న గంటా శ్రీనివాస‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం చేయ‌బోతున్నార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. విశాఖ న‌గ‌రంలోని ఓ అసెంబ్లీ స్థానం గానీ, నెల్లిమ‌ర్ల నుంచి గానీ గంటా బ‌రిలో ఉంటార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు దానికి భిన్నంగా క‌నిపిస్తున్నాయి. ఈసారి గంటా త‌న సీటు మార్చే యోచ‌న విర‌మించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి ఆయ‌న పార్టీ కూడా మార్చాల‌ని యోచించిన‌ట్టు తొలుత అంతా భావించారు. మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ నేత విజ‌య‌సాయి రెడ్డి కూడా ప్ర‌క‌టించారు. కానీ దానికి జ‌గ‌న్ స‌సేమీరా అన‌డంతో చేసేది లేక చివ‌ర‌కు జ‌న‌సేన వైపు గంటా మొగ్గు చూపిన‌ట్టు క‌నిపించింది. ప‌వ‌న్ ప‌ట్ల తొలుత మెత‌క వైఖ‌రి ప్ర‌ద‌ర్శించిన గంటా స్వ‌రంలో ఇటీవ‌ల మార్పు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న్ని త‌మ పార్టీలో చేర్చుకునే ఆలోచ‌న లేద‌న్న‌ట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. దాంతో ఇక అనివార్యంగా గంటా మ‌ళ్లీ ప‌సుపు జెండాతోనే ప‌య‌నించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న నెల్లిమ‌ర్ల సీటు మీద కూడా క‌న్నేశారు. అక్క‌డి నుంచి సీనియ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్యేని త‌ప్పించేందుకు టీడీపీ సుముఖంగా ఉంది. అదే స‌మ‌యంలో వైసీపీ కూడా సీనియ‌ర్ నేత పెన్మ‌త్స ఫ్యామిలీని రంగంలో దింపేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇవ‌న్నీ గంటాకి సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో ఆయ‌న‌కు బాగా క‌లిసొచ్చే అంశ‌మ‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో భీమిలి సీటు కోసం అవంతి శ్రీనివాస్ ప‌ట్టుబ‌డుతుండ‌డం కూడా దానికో కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

అయితే తాజాగా సిట్ నివేదిక‌లో గంటా కి క్లియ‌రెన్స్ ఇచ్చేశారు. ఆయ‌న త‌ప్పిదం లేద‌న్న‌ట్టుగా ప్ర‌భుత్వం తేల్చేసింది. దాంతో భీమిలి సీటు కూడా గంటాకి ఆటంకాలు లేవ‌ని అంతా భావిస్తున్నారు. గంటా స్వ‌యంగా మ‌రో స్థానం ఎంచుకుంటే త‌ప్ప భీమిలి ఆయ‌న ఖాతాలోనే ఉంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా భూదందాపై తాజా నివేదిక త‌ర్వాత గంటాకి టీడీపీలో ఆల్ క్లియ‌ర్ గానే క‌నిపిస్తోంది.


Related News

టీడీపీ ఎమ్మెల్యేకి కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ఇక్క‌ట్లలో ప‌డ్డారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెకుRead More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు పొందిన యువ‌నేత‌

Spread the loveజ‌న‌సేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. న‌వ త‌రాన్ని రాజ‌కీయంగా ఎదిగే దిశ‌లో ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేనాని కీల‌కRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *