చిచ్చు రాజేసిన గంటా

ganta srinivas
Spread the love

మంత్రి గంటా శ్రీనివాస‌రావు నిత్యం వార్త‌ల్లో ఉంటారు. ఆయ‌న చేసినా అది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. తాజాగా ఆయ‌న త‌న‌యుడి ప్ర‌క‌ట‌న ఇప్పుడు చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చిచ్చు రాజేసింది. టీడీపీ వ‌ర్గాలే గంటా మీద గంతెలేస్తున్నాయి. గంటా శ్రీనివాస‌రావు వ్య‌వ‌హారం మీద గుర్రుగా క‌నిపిస్తున్నారు. చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌లిదిండి సూర్య‌నాగ‌స‌త్య‌న్నారాయ‌ణ రాజు వ‌ర్గం ఏకంగా ఫిర్యాదులు చేసే వ‌ర‌కూ వెళ్లింది. పార్టీ అధినేత వ‌ద్ద పంచాయితీ పెడుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు గతంలో చోడ‌వ‌రం ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. అయితే ఒక్క‌సారి చోడ‌వ‌రం నుంచి పోటీచేసి విజ‌యం సాదించిన త‌ర్వాత ఆయ‌న అటువైపు పెద్ద‌గా చూడ‌లేదు. ఆత‌ర్వాత మ‌రో రెండు స్థానాలు ఆయ‌న మారిపోయారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను అక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌ని గంటా ర‌వితేజ ప్ర‌క‌టించ‌డం రాజు వ‌ర్గీయుల్లో గంద‌ర‌గోళం సృష్టిస్తోంది. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బాబుని ప‌క్క‌న పెడుతున్నార‌నే ప్ర‌చారం చోడ‌వ‌రం టీడీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

గంటా ర‌వితేజ ఇటీవ‌ల సినీరంగంలో ఎంట్రీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం కూడా ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే అది అంత సులువు కాక‌పోవ‌చ్చు గానీ భీమిలి నుంచి కాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల వైపు క‌న్నేసిన గంటాకు అక్క‌డ అవ‌కాశం ద‌క్క‌క‌పోతే చోడ‌వ‌రం వైపు మ‌న‌సు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో చోడ‌వ‌రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చికాకు వ్య‌క్తం చేస్తున్నారు. ఈవిష‌యంలో స్ప‌ష్ట‌త కావాల‌ని అధినేత ముందే పంచాయితీ చేయ‌డంతో చివ‌ర‌కు చంద్ర‌బాబు తాత్కాలికంగా స‌ర్థిచెప్పాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. కేఎన్ఎస్ఎన్ రాజు త‌న ప‌నితాను చేసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించ‌డం కొంత ఉప‌శ‌మ‌నంగానే భావిస్తున్నారు.

కానీ గంటా త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారితో నిత్యం ఏదో స‌మ‌స్య సృష్టిస్తుండ‌డంతో ఎమ్మెల్యే రాజుకి పెద్ద త‌ల‌నొప్పిగా త‌యార‌య్యింది. మాడుగ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంలో గంటా ఓ వ‌ర్గాన్ని న‌డుపుతుండ‌డంతో టీడీపీ విశాఖ న‌గ‌రంలోనే కాకుండా రూర‌ల్ కూడా రెండు ముక్క‌లాట న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

chinarajapp

రాజప్ప నియోజకవర్గంలో రాజీనామాలు

Spread the loveతెలుగుదేశం పార్టీలో పరిణామాలు మారుతున్నాయి. గడిచిన ఎన్నికల ముందు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప మరోసారిRead More

tdp

విద్యార్థిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Spread the loveసోషల్ మీడియా పోస్టుతో నేతల్లో మొదలవుతున్న అసహనం తీవ్రమవుతోంది. తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుRead More

 • తీవ్రవాయుగుండంతో వర్షాలు
 • వైసీపీలో వేడి రాజుకుంది..
 • ఏపీలోనూ డ్రగ్స్ కలకలం
 • ఆంధ్రా అల్లుడు-ఐర్లాండ్ ఆట‌గాడు
 • టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!
 • గంటాకు గంజాయితో ఝలక్ ఇచ్చిన అయ్యన్న
 • విద్యార్థుల కోసం జనసేనాని
 • మంత్రి గంటాకి అరెస్ట్ వారెంట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *