Main Menu

రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లేసిన గంటా!

Spread the love

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మారుస్తూ ఉంటారు. అంతేగాకుండా గ‌డిచిన రెండు ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలు కూడా మార్చారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ మారాల‌ని ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించే అవ‌కాశాలు లేవ‌న్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అటు జ‌గ‌న్, ఇటు ప‌వ‌న్ కూడా ఆయ‌న ప‌ట్ల సుముఖంగా లేక‌పోవ‌డంతో కొంద‌రు ఆయా పార్టీల నేత‌ల ద్వారా గంటా చేసిన ప్ర‌య‌త్నాలు ప‌లించ‌లేద‌ని స‌మాచారం.

అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లేసి ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది. అందులో భాగంగానే ఈసారి ఆయ‌న పార్టీ మారే అవ‌కాశాలు మూసుకుపోవ‌డంతో ఆయ‌న స‌మీప బంధువు, స‌న్నిహితుడు ప‌రుచూరి భాస్క‌ర్ రావు ని పార్టీ మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా కిర‌ణ్ కుమార్ రెడ్డి స‌మ‌క్షంలో భాస్క‌ర రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ‌డిచిన రెండు ద‌శాబ్దాలుగా గంటా రాజ‌కీయ ప్ర‌స్థానంలో భాస్క‌ర్ రావుది కీల‌క పాత్ర.. అటు వ్యాపార వ్య‌వ‌హారాలు, ఇటు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు భాస్క‌ర్ రావు చూస్తుండేవారు.

ఇటీవ‌ల గంటా శ్రీనివాస‌రావు అల్లుడు రంగంలో కి రావ‌డంతో భాస్క‌ర్ రావు ప్రాధాన్య‌త త‌గ్గింద‌నే ప్ర‌చారం ఉంది. అదే స‌మ‌యంలో గంటాతో కొన్ని మ‌న‌స్ప‌ర్థ‌లు కూడా వ‌చ్చాయ‌ని కొంద‌రు చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ భీమిలి బాధ్య‌త గంటా అల్లుడు చూస్తుంటే అక్క‌డి నుంచి ప‌రుచూరి భాస్క‌ర్ రావు అన‌కాప‌ల్లి పై దృష్టి పెట్టారు. గతంలో అన‌కాప‌ల్లి ఎంపీ, ఎమ్మెల్యేగా ప‌నిచేసిన గంటా హ‌యంలో గ‌ట్టి సంబంధాలున్న భాస్క‌ర్ రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి అసెంబ్లీ స్థానం మీద క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో టీడీపీ కాంగ్రెస్ క‌ల‌యిక‌లో భాగంగా అన‌కాప‌ల్లి సీటు కాంగ్రెస్ కి కేటాయిస్తే గంటా స‌న్నిహితుడు అక్క‌డి నుంచి కాంగ్రెస్ త‌రుపున బ‌రిలో ఉండే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఏమ‌యినా ఈ వ్య‌వ‌హారం విశాఖ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.






Related News

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the loveఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు.Read More

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *