చంద్ర‌బాబుకి గంటా ఝ‌ల‌క్..!

ganta babu
Spread the love

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. తాజాగా కాపుల వ్య‌వ‌హారాన్ని కొలిక్కి తీసుకొద్దామ‌ని భావిస్తున్న ఏపీ సీఎం కి ఆయ‌న స‌హాయ నిరాక‌ర‌ణ చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. విజ‌య‌వాడ‌లో కాపు నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి ఆయ‌న దూరంగా ఉండ‌డం విశేషంగా మారింది. ఏపీ క్యాబినెట్ లో న‌లుగురు కాపు మంత్రులున్నారు. కాగా వారిలో ఒక‌రు బీజేపీకి చెందిన మాణిక్యాల‌రావు. మిగిలిన ముగ్గురిలో ఒక‌రు డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప‌, మిగిలిన ఇద్ద‌రూ వియ్యంకుళ్లు నారాయ‌ణ‌, గంటా శ్రీనివాస‌రావు. వారంద‌రిలోనూ గంటానే సీనియ‌ర్ మంత్రి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం మీదు చంద్ర‌బాబు స‌మావేశానికి దూరంగా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు కాపుల విష‌యంలో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో కూడా ముద్ర‌గ‌డ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చినా ఆయ‌న ఖాత‌రు చేయలేదు. తుని ఘ‌ట‌న మొద‌లుకుని అనేక అంశాల‌లో స్పందించ‌లేదు. కానీ ఇటీవ‌ల అడ‌పా ద‌డ‌పా ఆయ‌న కూడా మాట్లాడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈ స‌మావేశానికి ఢుమ్మా కొట్ట‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ప‌రిశీల‌కుల అభిప్రాయం. మిగిలిన మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు స‌హా వివిధ జిల్లాల‌కు చెందిన కాపు నేత‌లు పాల్గొన్న స‌మావేశానికి గంటా దూరంగా ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు 1999 నుంచి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ 2004 త‌ర్వాత ఆయ‌న ప్ర‌తీసారి నియోజ‌క‌వ‌ర్గం, పార్టీ మారుతూ వ‌స్తున్నారు. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న మార‌డం ఓ సెంటిమెంట్ గా మారుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గంటా విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల మీద దృష్టిపెట్టిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇలాంటి ప‌రిణామాలు గ‌మ‌నిస్తే ఆయ‌న ప‌య‌నం ఎటు మ‌ళ్లినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. దానికి త‌గ్గ‌ట్టుగానే కాపుల‌కు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు లేకుండా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్న త‌రుణంలో త‌న అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఆయ‌న దూరంగా ఉన్నార‌ని భావిస్తున్నారు. ఏమైనా ఇది చంద్ర‌బాబుకి మింగుడు ప‌డే అంశం కాదు.


Related News

varma

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

Spread the loveజీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగాRead More

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *