Main Menu

విశాఖ‌లో టీడీపీకి మ‌రో షాక్

Spread the love

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గిలేలా క‌నిపిస్తోంది. ముఖ్యంగా గురువు కొణ‌తాల కి కండువా క‌ప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న చంద్ర‌బాబు ఆశ‌ల‌కి శిష్యుడు గండి బాబ్జీ గండి కొట్టే య‌త్నంలో ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. పెందుర్తి అసెంబ్లీ సీటు విష‌యంలో త‌న‌కు సానుకూల నిర్ణ‌యం వెలువ‌డ‌క‌పోతే పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు గండి బాబ్జీ ఇప్ప‌టికే స‌న్నిహితుల‌కు సంకేతాలు ఇచ్చేశారు. వైసీపీ గానీ, జ‌న‌సేన‌లో గానీ చేరిపోదామంటూ సూచించేశారు.

పెందుర్తి టీడీపీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు స‌త్య‌న్నారాయ‌ణ మూర్తి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఆఖ‌రి నిమిషంలో ఆయ‌న‌కు అన‌కాప‌ల్లి ఎంపీ సీటు విష‌యంలో కూడా ఛాన్స్ ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఏమ‌యినా పెందుర్తి సీటు త‌న‌కు ద‌క్క‌క‌పోతే దిక్కులు మార్చాల్సి ఉంటుంద‌ని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నిర్ణ‌యించుకోవ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంది.

కొణ‌తాల రామ‌కృష్ణ‌కు స‌న్నిహితుడైన గండి బాబ్జీ గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత టీడీపీలో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్న బాబ్జీ త‌న‌కు టీడీపీలో టికెట్ ద‌క్కే అవ‌కాశాలు స్వ‌ల్పంగా ఉన్న‌ట్టు భావిస్తున్నారు. అందుకు త‌గ్గట్టుగా భ‌విష్య‌త్ కి బాట‌లు వేసుకుంటున్నారు. అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళుతున్నారు. సీటు ఇచ్చే పార్టీలో చేర‌డం గ్యారంటీ అని చెబుతున్నారు. దాంతో పెందుర్తి రాజ‌కీయాలు టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *