తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌

tdp-members
Spread the love

తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌బ‌డ్డారు. పార్టీ ఆవిర్భావ‌దినోత్స‌వం నాడే కొట్లాకు దిగారు. ఏకంగా చొక్కాలు చింపుకునే వ‌ర‌కూ వెళ్లారు. పార్టీ ప‌ర‌వు బ‌జారుకీడ్చారు. విజ‌య‌న‌గ‌రంలో జిల్లాలో టీడీపీకి ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌లు తాండ‌విస్తున్నాయి. తాజాగా బొబ్బిలి పార్టీలో విబేధాలు తార‌స్థాయికి చేరాయి. ఢీ అంటే ఢీ అనేవ‌ర‌కూ వెళ్లాయి. రాష్ట్ర‌మంత్రి సుజ‌య కృష్ణ‌రంగారావుని వ్య‌తిరేకిస్తున్న వ‌ర్గం నిల‌దీడ‌యంతో ఈ వివాదం రాజుకుంది.

పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా మంత్రిని నిల‌దీశారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో త‌మ‌కు ప్రాధాన్య‌త ఎందుకివ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. దాంతో మంత్రి అనుచ‌రులు రెచ్చిపోయారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీయ‌డంతో తీవ్ర దుమారం రేగింది. తోపులాట జ‌ర‌గ‌డంతో ప‌లువురు తెలుగు త‌మ్ముళ్ల చొక్కాలు చింపుకునే వ‌ర‌కూ ప‌రిస్థితి వెళ్లింది. దాంతో ఆవిర్భావ స‌భ కాస్త ర‌ణ‌రంగంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది.

పాతికేళ్లుగా టీడీపీని న‌మ్ముకున్న వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి ఫిరాయింపు బ్యాచ్ కి మంత్రి పెద్ద పీట వేస్తున్నార‌న్న‌ది తెలుగు త‌మ్ముళ్ల ఆవేద‌న‌. సుదీర్ఘ‌కాలంగా పార్టీలో ఉన్న వారికి కాద‌ని, ఇత‌రుల‌కు అవ‌కాశాలిస్తుంటే తామేం చేయాల‌ని నిల‌దీస్తున్నారు. మంత్రి అనుచ‌రులు మాత్రం అంతా తామే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో విష‌యం ముదురుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

vizag-south-vasupalli-ganesh-kumar-tdp-140048322520-10-1489122042

అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Spread the loveటీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏకంగా పార్టీ కార్యాల‌యం ముందు నిర‌స‌న చేప‌ట్టారు.Read More

Haribabu bjp

హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!

Spread the loveఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మారుతున్నాడు. నాలుగేళ్లుగా అనేక ప్ర‌యత్నాలు చేసినా సాధ్యం కానిది అనూహ్యంగా జ‌రిగింది.Read More

 • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
 • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
 • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
 • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
 • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
 • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
 • సిట్టింగుల‌కు షాకివ్వ‌బోతున్న బాబు
 • ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *