వైసీపీలో మాజీ ఎమ్మెల్యే

ysrcp_1829
Spread the love
 • 9
  Shares

అరకు సహజంగా చల్లని ప్రాంతం. అందులోనూ శీతాకాలంలో అయితే మరింత చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు అరకు వైసీపీలో మాత్రం రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, బొత్సా అనుచరుడు కంభా రవిబాబు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అనూహ్యంగా రాజకీయాలు మారిపోయాయి. గతంలో అరకు సీటు విషయంలోనే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయినట్టు ప్రచారం జరిగింది. ఆమె తన అనుచరుడు శెట్టి లత్సాలు కోసం ప్రయత్నం చేశారు. కానీ తాజాగా రవిబాబుకి కండువా కప్పేసిన జగన్ , ఆయనకే టికెట్ ఖాయం చేసినట్టు ప్రచారం సాగుతోంది.

గతంలో రవిబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి గెలిచి టీడీపలో చేరిపోయారు. అసెంబ్లీలో విప్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కిడారికే టీడీపీ టికెట్ అనే ప్రచారం ఉంది. ఆయనకు పోటీగా వైసీపీ తరుపున కంభా రవిబాబుకి టికెట్ ఖాయం చేస్తే మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి గిరిజన ప్రాంతంలో వైసీపీకి గట్టు పట్టు ఉంది. దాంతో సీఎం చంద్రబాబు దత్తత గ్రామం ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తిగా మారుతుంది.

చిత్తూరు జిల్లా పూతల పట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ ని కలిసిన రవిబాబుకి అక్కడే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలు జగన్ తోనే పరిష్కారమవుతాయని రవిబాబుు ఆశాభావం వ్యక్తం చేశారు.


Related News

Sri Konathala Rama Krishna (11)

కొణతాల మళ్లీ తెరమీదకు…

Spread the love6Sharesమాజీ ఎంపీ, మాజీ మంత్రి కొణతాల రామక్రుష్ణ మరోసారి తెరమీదకు వస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్ డిమాండ్ తోRead More

ysrcp_1829

వైసీపీలో మాజీ ఎమ్మెల్యే

Spread the love9Sharesఅరకు సహజంగా చల్లని ప్రాంతం. అందులోనూ శీతాకాలంలో అయితే మరింత చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు అరకుRead More

 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • ఒంటరయిపోయిన గంటా
 • విరుచుకుపడిన విజయసాయిరెడ్డి
 • డెంగీ బారిన ఎంపీ
 • అనితకు ఎసరు పెడుతున్న ఆయన..!
 • గంటాను ఢీ కొట్టిన అచ్చెన్న
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *