Main Menu

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the love

రాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ ప‌శ్చిమం లేదా ఉత్త‌రం ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశాలు సుస్ఫ‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. దాంతో ద్రోణంరాజు శ్రీనివాస్ అడుగులు ఆస‌క్తిగా మారుతున్నాయి. ద్రోణంరాజుతో టచ్‌లో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఆయ‌న కండువా క‌ప్పుకునేఅ అవ‌కాశాలున్నాయి.

కాగా… టీడీపీ తరఫున విశాఖ ఉత్తరం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గానికి మంత్రి కొత్త కావడంతో ఆయన్ను ఓడించడానికి ద్రోణంను వైసీపీలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ 5769 మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఈయన పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీ+బీజేపీ కలిసి విష్ణుకుమార్ రాజును బలపరిచి బరిలోకి దింపి 18,240 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంది. అయితే 2019 ఎన్నికల్లో విష్ణు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు.






Related News

గంటా గెలుస్తారా?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రాజేస్తున్న సీట్ల‌లో విశాఖ నార్త్ ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటులో ఎవ‌రుRead More

Latest Survey: విజ‌య‌న‌గ‌రం విజేత ఎవ‌రు?

Spread the loveఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోనే అతి త‌క్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా విజ‌య‌న‌గ‌రం. ఈRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *