వైసీపీలో కొత్త వివాదం

padayatra_6486jagan
Spread the love

వైసీపీ వ్యవహారాలు రానురాను ఆసక్తిగా మారుతున్నాయి. కొత్త నేతలు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా విశాఖజిల్లా పాడేరు కోఆర్డినేటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీలో ముసలం పుట్టించింది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించడంతో కోఆర్డినేటర్ పోస్ట్ ఖాళీ అయ్యింది. దాంతో పలువురు నేతలు గట్టిగా ప్రయత్నించారు. అయితే తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని నియమించడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పరీక్షిత్‌రాజ్‌ పార్టీ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని పలువురు విమర్శలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం పార్టీలో చేరిన నాయకురాని ఏకంగా కోఆర్డినేటర్ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు.

భాగ్యలక్ష్మి నియమకాన్ని నిరసిస్తున్న నేతలంతా చింతపల్లిలో సమావేశం నిర్వహించారు. సమన్వయకర్త స్థానంలో భాగ్యలక్ష్మి నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకాకూడదని నిర్ణయించారు. ఆమె చేపట్టిన కార్యక్రమాలకు పోటీగా నిర్వహించాలని తలపెట్టి, కొవ్వొత్తుల ప్రదర్శన కూడా విడిగా చింతపల్లిలో చేపట్టారు. చింతపల్లి జెడ్పీటీసీ పద్మకుమారి ఈ సీటుకోసం ఆశిస్తున్నారు. కానీ ఆమె స్థానంలో భాగ్యలక్ష్మిని ముందుకు తెచ్చిన పరీక్షిత్ రాజ్ వ్యవహారాన్ని విజయసాయిరెడ్డి ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కడం లేదని జెడ్పటీసీ వర్గీయులు వాపోతున్నారు.

ఎమ్మెల్యే ఈశ్వరికి సన్నిహితురాలయిన భాగ్యలక్ష్మిని నియమిస్తే తాము సహించేది లేదని పలువురు నేతలు చెబుతుండగా, వైసీపీ అధిష్టానం మాత్రం కోఆర్డినేటర్ కిరీటం అంటే టికెట్ ఇచ్చినట్టు కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. అయినా మన్యంలో రాజుకున్న వివాదం మరింత ముదరకముందే ఆపార్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం నష్టం తప్పదు.


Related News

pawankalyan tour

పవన్ యాత్రలో అది లేకుండా పోయింది…

Spread the love7Sharesపవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటి వరకూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు, ట్వీట్లతో సరిపెట్టిన జనసేనానిRead More

thota chandrasekhar

మూడు పార్టీలు మారిన నేతతో జనసేనాని చెట్టాపట్టాల్!

Spread the love8Sharesకొత్త తరహా రాజకీయాలు అని చెప్పారు. యువతకు ప్రోత్సాహం అన్నారు. సాధారణ పార్టీలకు భిన్నంగా సాగుతామన్నారు. కానీRead More

 • ఎంపీపీని ఎంపీ చేయాలనుకుంటున్న జగన్
 • వైసీపీలో కొత్త వివాదం
 • మంత్రికి షాక్
 • బీజేపీ ఎమ్మెల్సీ ఓటమి
 • విశాఖ మీద గురిపెట్టిన విజ‌య‌సాయిరెడ్డి
 • అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!
 • అనిత అవుట్..?
 • అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *