Main Menu

వైసీపీలో వేడి రాజుకుంది..

ysrcp
Spread the love

అసలే అంతంతమాత్రంగా ఉన్న అనకాపల్లి అసెంబ్లీలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నేత దిలీప్‌కుమార్ చేరిక ప్రతిపాదన పెద్ద దుమారానికే తావుతీసే పరిస్థితికి తావిచ్చేలా కనిపిస్తోంది. దిలీప్‌ను కలిసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించేందుకు మాజీమంత్రి బొత్సతోపాటుగా ఆయన నివాసానికి వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌కు ఇంతవరకు ఆయనకు సన్నిహితులుగా మెలుగుతున్న పలువురు ముఖ్య నేతల నుండి చేదు అనుభవం ఎదురైంది. పార్టీకి చెందిన సీనియర్ నేత బొత్స వస్తున్నారని తెలిసినా ఈ పర్యటన కార్యక్రమానికి రాకుండా పూర్తిగా బహిష్కరించి తమ నిరసనను తెలియజేసారు.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ వ్యవహారశైలి పట్ల చాలాకాలంగా గుర్రుగా ఉన్న ఆ పార్టీ ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేసారు. తమకు మాటమాత్రంగానైనా ముందుగా తెలియజేయకుండా ఈ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, తుమ్మపాల సుగర్స్ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించే చర్యలపై ఆ పార్టీ స్థానిక నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తుమ్మపాలలోని తన నివాసంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిలీప్ కుమార్‌ను స్వయంగా కలిసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించేందుకు పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీమంత్రి బొత్స సత్యనారాయణతో పాటుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ ఆదివారం సాయంత్రం విచ్చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలందరికీ ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకుని అవాక్కయిని నియోజకవర్గంలోని మెజార్టీ పార్టీ ముఖ్యనేతలంతా పట్టణ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు నివాసంలో అత్యవసరంగా సమావేశమై నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ ఒంటెద్దు పోకడ చర్యలు నానాటికీ హద్దులు మీరుతున్నాయని, పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను విస్మరించి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమావేశంలో పాల్గొన్న నేతలంతా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పట్టణ వైఎస్సాఆర్ సిపి ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావుతోపాటు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా ఈ సమావేశంలో పాల్గొని దిలీప్‌ను కలిసేందుకు బొత్స, అమర్‌తోపాటుగా వెళ్లకూడదని, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పార్టీ సంస్థాగత పదవుల్లో సైతం యలమంచిలి ఇతర అసెంబ్లీల పరిధికి సముచిత స్థానం కల్పిస్తున్నారని, స్థానికంగా పార్టీనేతలెవరినీ ఎదగనివ్వడం లేదనే ఆగ్రహాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. దిలీప్‌ను వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ప్రతిపాధన గత చాలాకాలంగా ఉంది. అందులో భాగంగానే వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్, పార్టీ సీనియర్ నేత బొత్సను వెంటబెట్టుకుని దిలీప్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దిలీప్ అనుచరులతో నిర్వహించిన సమావేశంలో బొత్స మాట్లాడుతూ పార్టీలోకి వస్తే దిలీప్‌కు, ఆయన సన్నిహితులకు తగు సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా బొత్స కోరినట్లు తెలిసింది. ఇందుకు సమావేశంలో పాల్గొన్న దిలీప్ సైతం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలోనే నియోజకవర్గం నలుమూలల్లో ఉన్న తన ముఖ్య అనుచరులు, సన్నిహితులతోపాటుగా దిలీప్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బొత్స సమక్షంలో తన సుముఖతను వ్యక్తం చేసారు. ఇదిలావుండగా వైకాపాలో దిలీప్‌కుమార్ చేరే ప్రతిపాదనతోపాటు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అమర్ ఏకపక్ష వైఖరి, ఒంటెద్దు పోకడ విధానాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి స్వయంగా విన్నవించేందుకు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలంతా సన్నద్ధమవుతున్నారు. దీంతో ఇంతవరకు పార్టీనేత గుడివాడ అమర్ వ్యవహారశైలి పట్ల స్థానిక పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహావేశాలు ఒకేసారి బహిర్గతమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీలోకి తమకు గుర్తింపులేని పరిస్థితులుంటే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసేందుకు సైతం వెనుకాడేదని లేదని నియోజకవర్గంలోని పలువురు వైకాపా ముఖ్యనేతలు హెచ్చరిస్తున్నారు.


Related News

YS-Jagan-Botsa-Satyanarayana

ప‌ట్టు కోసం పాకులాడుతున్న బొత్సా

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో బొత్సాది ఓ భిన్న‌మైన శైలి. ఆయ‌న ఏమి చేసినా అది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంటుంది.Read More

ashokgajapathiraju-kAV--621x414@LiveMint

మాజీ మంత్రికి రాచ‌మ‌ర్యాద‌లు

Spread the loveఆయ‌న అస‌లే రాజుగారు. అందుకేనేమో పోలీసులు కూడా రాచ‌మర్యాదలు చేశారు. అమాత్య హోదాని వ‌దులుకున్నా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *