వాళ్లిద్దరూ కలిసి అశోక్ కి చెక్ పెట్టాలని..

ashokgajapathiraju-kAV--621x414@LiveMint
Spread the love

విజయనగరంలో టీడీపీలో చాలాకాలాంటా విబేధాలకు దూరంగా ఉంటారనే పేరుతుంది. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ సర్థుకుపోతూ పార్టీని కాపాడుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటారు. అందుకే కష్టకాలంలో కూడా టీడీపీకి విజయనగరంలో ఉనికి నిలుపుకుంటోంది. కానీ అలాంటి విజయనగరంలో ఇటీవల మారిణ పరిణామాలతో తగాదాలు తీవ్రమవుతున్నాము. ముఖ్యంగా వైసీపీ నేత సుజయ క్రుష్ణ రంగారావును పార్టీలో చేర్చుకోవడం. ఏకంగా మంత్రిపదవి కట్టబెట్టడంతో బొబ్బిలి రాజుల ప్రాధాన్యం మీద విజయనగరం రాజులు కారాలు మిరియాలు నూరుతున్నారు. దానికి ఆజ్యం పోసే రీతిలో ఇన్ఛార్జ్ మంత్రి తీరు ఉందని ప్రచారం సాగుతోంది. గంటా కారణంగా వివాదాలు మరింత ముదురుతున్నాయని టీడీపీ నేతలే వాపోతున్నారు.

ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీని వాసరావు, సుజయకృష్ణ రంగారావు కలిసి అశోక్ గజపతిరాజుకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న ప్రచారం అశోక్ వర్గాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. పార్టీలో కొత్త చిక్కులు తెస్తోంది. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెంపంచాయతీ తమ్మన్నమెరకల వద్ద గిరిజన యూనివర్శిటీ ప్రహరీ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కొత్త సమస్యకు కారణంగా మారుతోంది. ఎస్‌ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హడావుడిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రజాప్రతినిధులు గాని, ప్రతిపక్షంలోని గిరిజన ప్రజాప్రతినిధులుగాని, గిరిజన సంఘాల నేతలు గాని హాజరు కాలేదు. నిజానికి వారెవరికీ సరైన సమాచారం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేశారు. దీనికి కారణమేంటా అన్నదే ఇప్పుడు జిల్లాలో చర్చ.

గిరిజన యూనివర్శిటీని జిల్లాకు తీసుకురావడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేశారు. గిరిజనులకు ఇవ్వాల్సిన పరిహారంలో ఇంకా వివాదాలు పరిష్కారం కాకుండానే, హామీలు నెరవేర్చకుండానే ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండటంతో ఆ రోజు కార్యక్రమాన్ని గిరిజనులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వారికి మంత్రి సుజయకృష్ణ రంగారావు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ కార్యక్రమం అంత హడావుడిగా నిర్వహించడం వెనుక అసలు కారణం మంత్రి గంటా శ్రీనివాసరావు మెప్పు కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

యూనివర్శిటీ పనుల కాంట్రాక్టును మంత్రి బంధువుకు అప్పగించడంతో ఎలాగైనా పనులు మొదలుపెట్టించాలనే ఉద్దేశంతోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరునాడే అశోక్‌గజపతిరాజు జిల్లాకు వస్తున్నప్పటికీ ఆయనకోసం వేచి చూడకపోవడం అనుమానాలు బలపరుస్తున్నాయి. ఆయన జిల్లాలో ఉంటే ఆహ్వానించాల్సి వస్తుందనే ఈ హడావుడి ఏర్పాట్లని తెలుస్తోంది.

ఇవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే పిలుపునందుకుని వెళ్లిన మంత్రి సుజయకృష్ణ రంగారావు తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇతర నాయకులెవరూ లేకపోవడం, గిరిజనులు ప్రతిఘటించడం చూసి ఇరకాటంలో పడ్డారు. ఎలాగో కార్యక్రమాన్ని పూర్తి చేసి బయటపడినప్పటికీ వర్గపోరులో ఆయనో పావుగా మారారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి దగ్గర్నుంచి అనేక విషయాల్లో అశోక్‌ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు తార స్థాయికి చేరగా టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఇరువురి పక్షాన చేరి వర్గాలుగా విడిపోయారు. తాజా సంఘటనతో మరోసారి వీరి మధ్య విభేదాలు పొడసూపాయి.






Related News

varma

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

Spread the loveజీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగాRead More

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *