Main Menu

వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

varma
Spread the love

జీఎస్టీ సినిమా సంచ‌ల‌నం కావ‌డ‌మే కాకుండా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు పెను స‌మ‌స్య‌లు తీసుకొచ్చింది. పైగా తాజాగా వ‌ర్మ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త్వ‌ర‌లో వ‌ర్మ అరెస్ట్ ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఊపంద‌కుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణా సీసీఎస్ ముందు శుక్ర‌వారం నాటి విచార‌ణ‌కు ఆయ‌న గైర్హాజ‌ర‌వుతున్నారు.

కానీ అదే స‌మ‌యంలో విశాఖ‌లో కేసు మ‌రింత ప‌గ‌డ్భందీగా న‌మోద‌యిన‌ట్టు స‌మాచారం. మ‌హిళా సంఘాల దీక్ష‌తో వ‌ర్మ‌కు ఇక్క‌ట్లు వ‌చ్చిప‌డ్డాయి. పోలీసులు స్పందించి కేసు న‌మోదు చేయ‌క త‌ప్ప‌లేదు. వర్మపై ఎంవీపీ జోన్‌ పోలీసు స్టేషన్‌లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్‌ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల దీక్షతో ఎట్టకేలకు పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

దాంతో ఏపీలో న‌మోద‌యిన కేసుకి కూడా వ‌ర్మ విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిన ప‌రిస్థితి దాపురిస్తోంది. దాంతో వ‌ర్మ‌కు వైజాగ్ వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రోవైపు వ‌ర్మ‌ను అరెస్ట్ చేయాల్సిందేన‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న త‌రుణంలో వివాదం మ‌రింత రాజుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.






Related News

ganta

గంటా ఎపిసోడ్ లో కీల‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the loveగంటా శ్రీనివాస‌రావు ఎపిసోడ్ కి ముగింపు ప‌డిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. టీడీపీ తీరుతో అల‌క‌పాన్పు ఎక్క‌డం, అంత‌లోనే విందుRead More

ganta srinivas

గంటా గంట కొట్టేస్తారా..?

Spread the loveగంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయంగా ప్ర‌త్యేక శైలిలో సాగుతారు. విశాఖ‌లోనే కాకుండా రాష్ట్ర‌మంతా ఆయ‌న తీరు గురించి నిత్యంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *