Main Menu

పీలా కేసుతో ప‌క్క‌దారికేనా?

vishnukumar raju
Spread the love

భారీ భూకుంభ‌కోణం. ఆక్ర‌మ‌ణ‌లు ఒక‌వైపు, ఏకంగా రికార్డుల ట్యాంప‌రింగ్ మ‌రో వైపు. భీమిలి కేంద్రంగా మొద‌ల‌య్యి మొత్తం విశాఖ జిల్లాను వ్యాపించిన వ్య‌వ‌హారం. కానీ ఇప్పుడు చివ‌ర‌కు అది అన‌కాప‌ల్లి వ‌ద్ద తీరం దాటిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అక్క‌డి ఎమ్మెల్యే పీలా గోవింద్ కుటుంబంపై న‌మోదయిన కేసుతో సిట్ కూడా చేతులు దులుపుకోవ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకే పీలా గోవింద్ పై కేసును చాలామంది పెద‌వి విరుస్తున్నారు. పెద్ద చేప‌ల‌ను వ‌దిలేసిన వ్య‌వ‌హారంగా భావిస్తున్నారు.

బీజేపీ ఎల్పీ నాయ‌కుడు విష్ణుకుమార్ రాజు కూడా ఇలాంటి వాద‌న‌తో మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం సరికాదంటున్నారు. పీలాపై కేసు నమోదు చేయడం ద్వారా భూముల కుంభకోణంలో ఎంతటివారున్నా విడిచిపెట్టబోమనే సంకేతాలను ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే ప్రభుత్వ రికార్డులు ట్యాంపర్‌ చేసిన వ్యక్తులపై కాకుండా భూములు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేపై కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఈ వ్య‌వ‌హారంతో బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత దానికి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

రెండు, మూడు రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత ప్రస్తుతం భూమి యజమానులుగా ఉన్నవారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. రికార్డులు తారుమారు చేసిన వారిపై కేసులు నమోదు చేసి భూములు కొనుగోలు చేసిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సిట్‌ గడువును మరో నెల పొడిగించాలని కోరారు. ఇప్పటివరకూ 2వేలకుపైగా ఫిర్యాదులు సిట్‌కు అందాయని, విశాఖలో కబ్జాలు భారీగా జరిగాయనడానికి ఇంతకుమించి నిదర్శనం ఏం కావాలన్నారు. మరో సిట్‌ వేసి సగం మేర ఫిర్యాదులు వారికి అప్పగించాలని సూచించారు. కేసులు త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు సిట్‌ బృందాన్ని విష్ణుకుమార్‌ రాజు కలిశారు. సిట్‌ ఇన్‌చార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌తో సమావేశమయ్యారు. అనేక అంశాలపై ఫిర్యాదు చేసిన ఆయన, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇన్‌చార్జికి ఇచ్చారు.


Related News

YS-Jagan-Botsa-Satyanarayana

ప‌ట్టు కోసం పాకులాడుతున్న బొత్సా

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో బొత్సాది ఓ భిన్న‌మైన శైలి. ఆయ‌న ఏమి చేసినా అది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంటుంది.Read More

ashokgajapathiraju-kAV--621x414@LiveMint

మాజీ మంత్రికి రాచ‌మ‌ర్యాద‌లు

Spread the loveఆయ‌న అస‌లే రాజుగారు. అందుకేనేమో పోలీసులు కూడా రాచ‌మర్యాదలు చేశారు. అమాత్య హోదాని వ‌దులుకున్నా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *