హోదా అడిగినందుకు పార్టీలో వేటు!

ADARI KISHOR
Spread the love

ఏపీలో ప్ర‌త్యేక హోదా హాట్ టాపిక్ అవుతోంది. హ‌స్తిన‌లో అవిశ్వాసం వ‌ర‌కూ వెళ్లింది. అంతేగాకుండా ఆఖరికి బీజేపీలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌మ‌ల‌ద‌ళంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే కొంద‌రు కీల‌క నేత‌లు బీజేపీ నుంచి జారిపోయారు. హోదా విష‌యంలో బీజేపీకి రాంరాం చెప్పిన కొంద‌రు నేత‌లు జ‌న‌సేన నేత‌లుగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

ఇక తాజాగా విశాఖ‌లో ఓ యువ‌నేత మీద బీజేపీ వేటు వేసింది. దానికి కార‌ణం ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దించ‌డ‌మే. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో తెర‌మీద‌కు వ‌చ్చిన విశాఖ వాసి అడారి కిషోర్ కుమార్ ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. కానీ తాజాగా ఆయ‌న బ‌హిరంగంగా పార్టీ తీరుని విమ‌ర్శించార‌నే పేరుతో ఆయ‌నపై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు హ‌రిబాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చోటే పార్టీలో భిన్నాభిప్రాయాలు రావ‌డంతో వెంట‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీజేపీ నిర్ణ‌యంపై అడారి కిషోర్ సీరియ‌స్ అయ్యారు. బీజేపీ మోసం చేసింద‌ని వాపోయారు. త‌న‌తో పాటు అనేక‌మంది పార్టీ మీద న‌మ్మ‌కంతో చేరితే, చివ‌ర‌కు హోదా హామీని తుంగ‌లో తొక్కి ఇప్పుడు అడిగినందుకు వేటు వేయ‌డం అన్యాయ‌మంటున్నారు. తాను మాత్రం పార్టీలు, జెండాల‌కు అతీతంగా హోదా కోసం సాగుతున్న ఉద్య‌మానికి అండగా ఉంటాన‌ని తెలిపారు. మొత్తంగా హోదా బీజేపీని కుదేలు చేస్తుంద‌న్న మాట‌.


Related News

vizag-south-vasupalli-ganesh-kumar-tdp-140048322520-10-1489122042

అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Spread the loveటీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏకంగా పార్టీ కార్యాల‌యం ముందు నిర‌స‌న చేప‌ట్టారు.Read More

Haribabu bjp

హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!

Spread the loveఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మారుతున్నాడు. నాలుగేళ్లుగా అనేక ప్ర‌యత్నాలు చేసినా సాధ్యం కానిది అనూహ్యంగా జ‌రిగింది.Read More

 • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
 • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
 • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
 • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
 • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
 • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
 • సిట్టింగుల‌కు షాకివ్వ‌బోతున్న బాబు
 • ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *