Main Menu

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the love

ఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనే విషయంలో ఆచితూచి అడుగులేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీకి విశాఖ నుంచి కంభంపాటి హ‌రిబాబు, న‌ర్సాపురం గోక‌రాజు గంగ‌రాజు ఎంపీలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మద్ధ‌తుతో ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. గ‌తంలో ప‌లుమార్లు బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌యిన హ‌రిబాబు తో పాటు తొలిసారి బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ గోక‌రాజు కూడా విజ‌యం సాధించి మొద‌టి సారిగా పార్ల‌మెంట్ లో అడుగుపెట్టారు.

అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మారిన రాజ‌కీయాల్లో ఏపీలో బీజేపీ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. దానిని అధిగ‌మించేందుకు క‌మ‌లం పెద్ద‌లు క‌స‌ర‌త్త‌లు చేస్తున్నారు. పార్టీకి ఏపీ శాఖ అధ్య‌క్షుడిని కూడా మార్చారు. మ‌రిన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితాలిస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మోడీ ఇమేజ్ వేగంగా ప‌డిపోయిన త‌రుణంలో చివ‌ర‌కు నేరుగా పీఎం మోడీని బ‌రిలోకి తెచ్చేందుకు కాషాయ పార్టీ నిర్ణ‌యించింది. వ‌చ్చే నెల‌లో మోడీ ఏపీలో అడుగుపెట్ట‌బోతున్నారు. న‌ర్సాపురం పార్ల‌మెంట్ ప‌రిధిలోని తాడేప‌ల్లిగూడెంలో మోడీ స‌భ జ‌రిగే అవ‌కాశం ఉంది.

అయిన‌ప్ప‌టికీ క‌మ‌ల వికాసం క‌ష్ట‌మేన‌ని ఈ ఇద్ద‌రు సిట్టింగులు నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. గోక‌రాజు గంగ‌రాజు త‌న‌యుడు రంగ‌రాజు వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. జ‌గ‌న్ తో త‌న‌కున్న స్నేహం కార‌ణంగా ఆయన తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో త‌న‌యుడికి లైన్ క్లియ‌ర్ చేయ‌డంలో భాగంగా గోక‌రాజు పోటీకి దూరంగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక హ‌రిబాబు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు విశాఖ‌లో బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మారిన ప‌రిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌న్న అభిప్రాయంతో ఉన్న హ‌రిబాబు ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా అందుబాటులో కూడా ఉండ‌డం లేదు. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న త‌రుణంలో పోటీకి నిరాక‌రించ‌డం ద్వారా త‌న గౌర‌వాన్ని నిలబెట్టుకునే యోచ‌న‌లో కంభంపాటి ఉన్నార‌ని భావిస్తున్నారు. దాంతో ఇద్ద‌రు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీకి సెల‌వు అంటుండ‌డంతో బీజేపీ పెద్ద‌ల్లో క‌ల‌వ‌రం క‌నిపిస్తోంది.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *