Main Menu

బీజేపీ నుంచి మ‌రో ఎమ్మెల్యే అవుట్

Spread the love

నాలుగేళ్ల పాటు అధికారం అనుభ‌వించిన‌ప్ప‌టికీ ఇప్పుడు బీజేపీ నానా ఇక్క‌ట్లు ప‌డుతోంది. మ‌నుగ‌డ కోసం ముప్పుతిప్ప‌లు ప‌డాల్సిన ప‌రిస్థితిలో ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌మ‌ల‌నాధుల ప‌రిస్థితి త‌యార‌య్యింది. దాంతో ఆపార్టీలో కొన‌సాగేందుకు ప‌లువురు విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో మోడీ ఇమేజ్ ఊపు మీద ఉన్న ద‌శ‌లో ప‌లువురు మ‌ధ్య‌వ‌ర్తులు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆక్ర‌మంలోనే టికెట్లు తెచ్చుకుని గెలిచిన త‌ర్వాత ప్ర‌స్తుతం బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పటికే రాజ‌మండ్రి ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ బీజేపీని వీడి జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఆ త‌ర్వాత ఇప్పుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆయ‌న్ని అనుస‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా విష్ణుకుమార్ రాజు కామెంట్స్ దానికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున పోటీ చేస్తారా అని అడిగిన విలేక‌రుల ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేయ‌డం దానికి నిద‌ర్శ‌నంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది నోటిఫికేషన్ వచ్చాకే చెబుతానని వెల్లడించారు. ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తే సరైన కవరేజ్ రాదంటూ ఛమత్కరించారు.

ఇప్ప‌టికే విష్ణుకుమార్ రాజు టీడీపీతో ట‌చ్ లో ఉన్నారు. నార్త్ సీటు కేటాయిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు సాయం అంశాలపై తెలుగుదేశానికి మైలేజ్ ఇచ్చే అంశంగా విష్ణు పేర్కొన‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. డబ్బులిచ్చినప్పుడు సహజంగానే సానుకూలత వస్తుందని వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఎందుకంటే గతంలో విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు అంతగా విమర్శించడం లేదంటే ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *