అయ్య‌న్న కూడా మారాల‌నుకుంటున్నారా?

ayyanna
Spread the love

తెలుగు త‌మ్ముళ్ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కూడా 2019 ఎన్నిక‌ల కోసం మార్పు ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. దానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న పావులు క‌దుపుతున్నార‌నే స‌మాచారం వారిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వాస్త‌వానికి న‌ర్సీప‌ట్నంలో అయ్య‌న్న‌పాత్రుడికి బ‌ల‌మైన పునాది ఉంది. సామాజికంగానూ, రాజ‌కీయంగానూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఆయ‌న మార్పు ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

న‌ర్సీప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని న‌మ్ముకుని సుదీర్ఘ‌కాలంగా ఆయ‌న్న పాత్రుడు సాగుతున్నారు. మ‌ధ్య‌లో ఒక‌సారి ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సి వ‌చ్చినా , రెండు మార్లు ఓట‌మి పాల‌యినా నియోజ‌క‌వ‌ర్గాన్ని విడిచిపెట్ట‌లేదు. దానికి త‌గ్గ‌ట్టుగానే సామాజిక స‌మీక‌ర‌ణాలు స‌హా ఇత‌ర అనేక అంశాలు ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చాయి. కానీ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఆయ‌న న‌ర్సీప‌ట్నం క‌న్నా మాడుగుల సుర‌క్షిత‌మ‌న్న అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు భావిస్తున్నారు. మాడుగుల నియోజ‌క‌వ‌ర్గంలో కూడా సామాజిక వ‌ర్గం కీల‌కంగా ఉండ‌డం, ప్ర‌స్తుతం అక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే మీద వ్య‌తిరేక‌త ఉంద‌న్న అంచ‌నాకు రావ‌డంతో మాడుగ‌ల మీద మంత్రిగారి క‌న్ను ప‌డింద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి.

కానీ మంత్రి అనుచ‌రులు మాత్రం వాటిని విశ్వ‌సించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న పాత్రుడి త‌న‌యుడు చింత‌కాయ‌ల విజ‌య్ పోటీ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. ఒక‌వేళ విజ‌య్ పోటీ చేయాల్సి వ‌స్తే ఆయ‌న కోసం న‌ర్సీప‌ట్నం ఖాళీ చేసి, అయ్య‌న్న మాడుగ‌ల వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అంగీక‌రిస్తున్నారు. కానీ వారిద్ద‌రికీ సీట్లు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు అనుమ‌తిస్తారా అంటే సందేహామే. అయినా ఆశ‌తో ముందుకు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి అయ్య‌న్న మార్పు ఆశ‌లు , అంచ‌నాలు నిజంగా ఎటుదారితీస్తాయ‌న్న‌ది.


Related News

ysrcp tdp

విశాఖ సమరం షురూ..

Spread the loveఇప్పటికే రాయలసీమలో నంద్యాల, గోదావరి జిల్లాల్లో కాకినాడ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులRead More

ganta babu

చంద్ర‌బాబుకి గంటా ఝ‌ల‌క్..!

Spread the loveఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. తాజాగాRead More

 • 2019 వ‌ర‌కూ టీడీపీతో..!
 • అయ్య‌న్న కూడా మారాల‌నుకుంటున్నారా?
 • వైసీపీకి మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు..!
 • హుద్ హుద్ నిధులు గాలిలో..చ‌ద‌వండి…!!!
 • రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
 • చిచ్చు రాజేసిన గంటా
 • క‌ట‌క‌టాల్లో టీడీపీ నేత‌
 • పీలా కేసుతో ప‌క్క‌దారికేనా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *