గంటాకు గంజాయితో ఝలక్ ఇచ్చిన అయ్యన్న

ganta ayyanna
Spread the love

విశాఖ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. ఇప్పటికే నర్సీపట్నంలోని ఆర్టీసీ స్థలం విషయంలో విబేధాలు రచ్చకెక్కుతున్న తరుణంలో మరోవైపు గంజాయి చుట్టూ గరంగరంగా మారుతున్నాయి. ఓవైపు ఏజన్సీలో గంజాయి రవాణా సాగు విషయంలో వివాదం కొనసాగుతుండగా తాజాగా నగరంలో రవాణా అవుతున్న గంజాయి విషయంలో మంత్రి గంటా మీద అయ్యన్న గురిపెట్టినట్టు కనిపిస్తోంది.

మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలే వస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఎక్సైజ్‌ పోలీస్‌శాఖ పూర్తిగా విఫలమైందని మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైకి గంజాయి అక్రమరవాణా ఎలా జరుగుతుందో అన్నిశాఖలకు తెలుసునని, అయినా చర్యలు తీసుకోవడంలేదని అన్నారు.

గంజాయి నియంత్రణపై ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష చేశారు. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గంజాయి విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్‌కు ఎలా రవాణా అవుతుందో పోలీస్, ఎక్సైజ్ డిపార్టుమెంట్‌లకు తెలుసునని, దీనికి ఏ పెద్దలు సహకరిస్తున్నారో వాళ్లను గుర్తించి, పీడీ యాక్టు పెట్టి జైల్లో పెడితే వారికి భయం వస్తుందని అయన్న అన్నారు.






Related News

giddi esshwari

వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్..?

Spread the loveరాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. వైసీపీ నుంచి మరో వికెట్ పడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. పార్టీలో మంచి గుర్తింపుRead More

kothapalli geetha

మహిళా ఎంపీని బ్లాక్ మెయిల్ చేశారు…

Spread the loveఏపీలో ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి వార్తల్లోకి వచ్చారు. పార్టీ ఫిరాయించినప్పుడు, కుల సర్టిఫికెట్ వివాదంలోRead More

  • బీసీ వర్సెస్ బీసీ
  • బీజేపీలో డూప్లికేట్ నాయకులున్నారంటున్న మంత్రి
  • కులదేవత మీద ఆన..జగన్ అన్నతోనే
  • జనసేన భవితవ్యం చెప్పిన బీజేపీ ఎమ్మెల్సీ
  • అచ్చెన్నా..ఏమిటీ పని?
  • ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో షాక్
  • రంగంలోకి మాజీ స్పీకర్ కూతురు
  • కొత్త రాష్ట్రపతి తొలి అడుగు ఉత్తరాంధ్రలో..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *