Main Menu

మ‌ళ్లీ నోటికి ప‌నిచెప్పిన ఏపీ మంత్రి

Spread the love

ఆంధ్రప్ర‌దేశ్ క్యాబినెట్ లో ఆయ‌న తీరే వేరు. సీనియ‌ర్ మంత్రి అయిన‌ప్ప‌టికీ నోరు అదుపులో పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు లేదు. సొంత పార్టీ నేత‌ల మీద‌, సాటి మంత్రి మీద కూడా ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేస్తుంటారు. అదే క్ర‌మంలో సామాన్య ప్ర‌జ‌ల మీద ప‌దే ప‌దే విరుచుకుప‌డుతుండ‌డం అయ్య‌న్న పాత్రుడి వ్య‌వ‌హార శైలిగా మారిపోయింది.

అదే క్ర‌మంలో తాజాగా ఆయన మ‌రోసారి నోటికి పనిచెప్పారు. మహిళల ప‌ట్ల మంత్రి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాల‌య్యాయి. ఏకంగా అసభ్యంగా ఉన్న ఆయ‌న మాట‌లు ఆశ్చ‌ర్యానికి, ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వితుంతు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భర్త చనిపోయినవారికి పెన్షన్‌ అడిగితే సరేగాని.. దుక్కలా ఉండి పెన్షన్‌ కావాలంటే ఎలా? ఊళ్లలో కొంతమంది మహిళలు తమ భర్త లేడు. పెన్షన్‌ కావాలంటారు. ఉన్నాడా.. పోయాడా అంటే చెప్పరు. పదేళ్లుగా జాడ లేదని చెప్తారు. అలాంటి వారికి పెన్షన్‌ ఎందుకు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం. భర్తలను మీరు (వితంతువులు) రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు’ అని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడుతారా అని తిట్టిపోస్తున్నారు.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *