Main Menu

అశోక్ గ‌జ‌ప‌తి మాట‌ల్లో అంత‌రార్ధం ఏమిటి?

Spread the love

ఏపీలో టీడీపీ హల్ చ‌ల్ చేస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏమ‌యినా చేస్తామ‌ని చెబుతోంది. కానీ కేంద్రంలో మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాత్రం ఇవేమీ ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్ల‌మెంట్ ముందు ఆందోళ‌న చేస్తున్న ఎంపీల‌ను క‌నీసం కూడా ప‌ల‌క‌రించ‌లేదాయ‌న‌. రాజీనామాలు,అ విశ్వాస తీర్మానాల వంటి వాటి జోలికే పోవ‌డం లేదు. అందుకు తోడు తాజాగా కొంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌కు కేంద్ర‌మే ప్ర‌ధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల కోసమే ప‌నిచేస్తాన‌ని తేల్చేశారు. ప‌నిలో ప‌నిగా బోగాపురం ఎయిర్ పోర్ట్ టెండ‌ర్ల తీరుపై పెద‌వి విరిచారు. దాంతో అశోక్ మాట‌ల వెనుక అంత‌రార్ధం తెలియ‌క తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

వైజాగ్ లో జ‌రుగుతున్న ఇన్విస్టిమెంట్స్ స‌మ్మిట్ లో కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా ముందు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేస్తున్న ఇద్ద‌రు టీడీపీ మంత్రుల‌కు ప్ర‌త్యేక హోదాతో సంబంధం లేదన్నారు. ఈ అంశంతో త‌మ‌కు ముడిపెట్ట‌వ‌ద్ద‌ని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా భోగాపురం ఎయిర్‌పోర్టు కార్గోను కలిపే టెండర్‌ ఎందుకు పిలవలేదన్న ప్రశ్నకు ఆశోక్‌ తనదైన శైలిలో సమాధాన మిచ్చారు. ‘నేను టెండర్లు పిలిచే గూమాస్తాను కాదు. తొలిసారి టెండర్‌లో కార్గో సర్వీసును ఎందుకు చేర్చలేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి’ అని వ్యాఖ్యానించారు. త‌ద్వారా చంద్ర‌బాబు తీరును ఆయ‌న త‌ప్పుబ‌ట్టిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశ‌మంతా పెట్టుబ‌డులు త‌గ్గుతున్నాయ‌ని, హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా రావ‌డం లేద‌ని అశోక్ పేర్కొన్నారు. దాంతో కొంత కాలంగా ఆయ‌న చంద్ర‌బాబుతో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగానే మాటలుండ‌డం విశేషంగా మారింది. బాబు తీరుతో అశోక్ గ‌జ‌ప‌తి అసంతృప్తిలో ఉన్నార‌న్న‌ది దానికి అనుగుణంగా కామెంట్స్ క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు.


Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *