Main Menu

అనిత అవుట్..?

Spread the love

అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న చందంగా మారుతోంది టీడీపీ ప‌రిస్థితి. గ‌డిచిన కొంత‌కాలంగా చంద్ర‌బాబు ఆశించిన దానికి భిన్నంగా ప‌రిణామాలు సాగుతున్నాయి. తాజాగా టీటీడీ బోర్డ్ నియామ‌కంలో తీవ్ర జాప్యం త‌ర్వాత కొత్త పాల‌క‌వ‌ర్గానికి జెండా ఊపినా ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. చైర్మ‌న్ నియామ‌క ద‌శ నుంచి దాటిన త‌ర్వాత తాజాగా బోర్డ్ స‌భ్యుల వ్య‌వ‌హారం వివాదం అయ్యి కూర్చింది.

ముఖ్యంగా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే అనిత చుట్టూ వివాదం పెను దుమారం అయ్యింది. టీటీడీని అన్య‌మ‌త‌స్తుల‌తో నింపేస్తున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇప్ప‌టికే పుష్క‌రాల సంద‌ర్భంగా బెజ‌వాడ‌లో విగ్ర‌హాల తొల‌గింపు ఓ వివాదం కాగా, తాజాగా టీటీడీ విష‌యంలో టీడీపీ తీరుని చాలామంది సందేహించే ద‌శ‌కు తెచ్చేస్తోంది. నారా లోకేష్ కోట‌రీలో అనిత కీల‌కంగా మారిన‌ట్టు, ఆయ‌న చ‌ల‌వ‌తోనే అనిత‌కి ఈ ప‌ద‌వి ద‌క్కిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. యువ‌నేత శిబిరంలో కీల‌కంగా మార‌డం ద్వారా గ‌తంలోనే అనిత పేరు ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌వి కోసం ప‌రిశీలించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు అది జ‌వహార్ కి ద‌క్కింది. ఇప్పుడు టీటీడీ ప‌ద‌వుల్లో విష‌యంలో ప‌ట్టుబ‌ట్టి ఆమెకు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన‌ప్ప‌టికీ, ఆమె వ్యాఖ్య‌లే ఇప్పుడు గుదిబండ‌లుగా మారాయి.

దాంతో టీడీపీ అదిష్టానం వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆమెను బోర్డ్ ప‌ద‌వి బాధ్య‌త‌ల్లోకి తీసుకోకూడ‌ద‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో టీడీపీలో రెండు వాద‌న‌లున్న‌ప్ప‌టికీ త‌క్ష‌ణం ప‌రిస్థితి చ‌క్క‌దిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆమె స్పందించారు. చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటానంటూ ప్ర‌క‌టించారు. త‌ద్వారా అదిష్టానం త‌న పేరుని బోర్డ్ మెంబ‌ర్స్ జాబితాలో త‌ప్పించ‌డానికి త‌గ్గ‌ట్టుగా సాగుతున్న ప్ర‌య‌త్నాల‌కు ఆమె అంగీక‌రించిన‌ట్టు భావిస్తున్నారు. ఇప్పుడు వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తురాలినంటూ ఎంత‌గా వాదించినా గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల ప్రభావం ఉండ‌డంతో దిద్దుబాటు చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. చివ‌ర‌కు అనిత‌కి ద‌క్కిన ప‌ద‌వి అనూహ్యంగా కోల్పోవాల్సి రావ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. కానీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కొంత ఆలోచించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా జ‌నంలో వ‌చ్చే స్పంద‌న‌ను గ‌మ‌నించి తుది నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


Related News

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the loveఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు.Read More

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *