అనితకు ఎసరు పెడుతున్న ఆయన..!

TDP MLA Anitha
Spread the love

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నిత్యం వార్తల్లో ఉంటారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ ఆమె మాత్రం మంచి పాపులారిటీనే సాధించారు. పాపులారిటీ వచ్చినప్పటికీ ప్రజల్లో పలుకుబడి తగ్గిపోవడంతో అనిత పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ మాజీ పంతులమ్మకి తన సామాజిక నేపథ్యాన్ని కూడా ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతల మీద దూకుడుగా సాగడంలో అందెవేసిన చేయి.

అయితే అంతా చేస్తున్నా ఆమెకు ప్రజల్లో ఆదరణ మాత్రం తగ్గుతుండడం తలనొప్పిగా మారుతోంది. చివరకు అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి దాపురించడం విశేషం. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు ఆమె పట్ల తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు కూడా అనిత పట్ల గుర్రుగా ఉన్నారు. అధిష్టానం వద్దకు పదే పదే ఫిర్యాదులు అందుతున్న తరుణంలో టీడీపీ అధిష్టానం కూడా పాయకరావు పేట విషయంలో పునరాలోచన చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా విశాఖలో ఉంటూ నియోజకవర్గ వాసులకు అందుబాటులో లేకపోవడం, సమస్యల విషయంలో సామాన్యులకు చేరువ కాలేకపోవడంతో అనిత ఆదరణ వేగంగా పడిపోయిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి , రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీని టీడీపీలో చేర్చుకుని ఆయనకు పాయకరావు పేట టికెట్ కేటాయించే అవకాశం ఉందంటూ తెలుగుతమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారు. మంత్రి కళా వెంకట్రావుతో ఉన్న విబేధాల నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఆశీస్సులు కొండ్రు మురళీకి ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో అచ్చెన్న ద్వారా మంతనాలు జరిపి పాయకరావుపేట తనకు ఖాయం చేస్తే రాజాం వీడి పాయకరావు పేటలో మకాం పెట్టేస్తానని చెబుతున్నట్టు సమాచారం. దాంతో రాజాంలో టీడీపీ బలం పెరగడమే కాకుండా, పాయకరావు పేట ఫ్రెష్ గా పార్టీని నడిపించే నాయకుడిగా మురళీ ఉపయోగపడతారని టీడీపీ అంచనా వేస్తోంది. వాస్తవానికి కోండ్రుమురళీ వైసీపీ లో రావాలని ఆశించినప్పటికీ ఆ పార్టీలో ఖాళీ లేకపోవడంతో ఇక సైకిల్ ఎక్కాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దాంతో ఆయన రాక అనితకు ఎసరు పెట్టే కార్యక్రమంగా మారబోతోందన్నది టీడీపీ వర్గాల కథనం. తాజాగా అచ్చన్న, గంటా మధ్య విబేధాలకు ఇది కూడా ఓ కారణం కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.


Related News

kothapalli geetha

ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ

Spread the loveవైసీపీ నుంచి గెలిచి, ఆ త‌ర్వాత టీడీపీ పంచ‌న చేరిన అర‌కు ఎంపీకి షోకాజ్ నోటీసు జారీRead More

ADARI KISHOR

హోదా అడిగినందుకు పార్టీలో వేటు!

Spread the loveఏపీలో ప్ర‌త్యేక హోదా హాట్ టాపిక్ అవుతోంది. హ‌స్తిన‌లో అవిశ్వాసం వ‌ర‌కూ వెళ్లింది. అంతేగాకుండా ఆఖరికి బీజేపీలోRead More

 • హ‌రిబాబుకి అన్నీ అడ్డంకులే..!
 • ప‌వ‌న్ అప‌హాస్యం కాకుండా చూసుకోవాలి…!
 • చంద్ర‌బాబు FB పేజీలో ర‌చ్చ ర‌చ్చ‌
 • అశోక్ గ‌జ‌ప‌తి మాట‌ల్లో అంత‌రార్ధం ఏమిటి?
 • వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు
 • బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *