అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!

TDP MLA Anitha
Spread the love

ఏపీలో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల జాబితాలో వంగ‌ల‌పూడి అనిత ఒక‌రు. గ‌తంలో ఉపాధ్యాయురాలుగా ప‌నిచేసి, టికెట్ సాధించిన తొలిసారే ఆమె పాయ‌క‌రావు పేట నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయినా ఆది నుంచి ఆమె వివాద‌స్ప‌ద‌మే. సొంత కుటుంబంలో త‌గాదాలు. పార్టీ నేత‌ల‌తో విబేధాలు. ప్ర‌త్య‌ర్థి ప్ర‌తిప‌క్ష వైసీపీతో నిత్య వైరం. చివ‌ర‌కు రోజా స‌స్ఫెన్ష‌న్, సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారి అరెస్టులు వంటి వాటికి అనిత ఆధ్యురాలు. ఆఖ‌రికి టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ గా ఎన్నిక‌య్యి పెనుదుమారం సృష్టించారు. టీడీపీకి త‌ల‌నొప్పిగా మారారు. దాంతో ఆమె మ‌తం విష‌యంలో రాజుకున్న వివాదం నుంచి గ‌ట్టెక్క‌డానికి టీడీపీ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన మార్గాన్ని అన్వేషించిన‌ట్టు కనిపిస్తోంది.

అందులో భాగంగా తాను హిందువున‌ని, ఎస్సీ మ‌హిళ‌ను కాబ‌ట్టి త‌న మీద దాడిచేస్తున్నార‌ని మాట్లాడిన అనిత ఎట్ట‌కేల‌కు దిగివ‌చ్చారు. తాను హిందువే అయిన‌ప్ప‌టికీ టీటీడీ వ్య‌వ‌హారంలో వివాదం త‌లెత్త‌డంతో త‌న‌ను ప‌క్క‌న పెట్టాల‌ని చంద్ర‌బాబుకి లేఖ రాశారు. త‌ద్వారా ఆమె మీద వేటు వేసిన‌ట్టు కాకుండా, వివాదానికి చెక్ పెట్ట‌డంలో భాగంగా మ‌ధ్యేమార్గాన్ని ఎంచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌ద్వారా ఆమె గౌర‌వం, పార్టీ ప‌రువు కాపాడిన‌ట్ట‌వుతుంద‌నే అంచ‌నాతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి తొలుత ప్ర‌క‌టించిన జాబితాలో ఆమె పేరు తొల‌గించ‌డం ఖాయం అయ్యింది. అందులో భాగంగానే ఆమె కూడా స్వ‌యంగా వైదొల‌గ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నార‌నే ప్ర‌చారం ప్రారంభించిన‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తానికి ఏమ‌యినా అనిత ప్ర‌స్థానంలో మ‌రో వివాదం చేరి, చివ‌ర‌కు ఆమె ప‌ద‌వి యోగ్యానికి గండికొట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.






Related News

pawankalyan tour

పవన్ యాత్రలో అది లేకుండా పోయింది…

Spread the loveపవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటి వరకూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు, ట్వీట్లతో సరిపెట్టిన జనసేనానిRead More

thota chandrasekhar

మూడు పార్టీలు మారిన నేతతో జనసేనాని చెట్టాపట్టాల్!

Spread the loveకొత్త తరహా రాజకీయాలు అని చెప్పారు. యువతకు ప్రోత్సాహం అన్నారు. సాధారణ పార్టీలకు భిన్నంగా సాగుతామన్నారు. కానీRead More

  • ఎంపీపీని ఎంపీ చేయాలనుకుంటున్న జగన్
  • వైసీపీలో కొత్త వివాదం
  • మంత్రికి షాక్
  • బీజేపీ ఎమ్మెల్సీ ఓటమి
  • విశాఖ మీద గురిపెట్టిన విజ‌య‌సాయిరెడ్డి
  • అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!
  • అనిత అవుట్..?
  • అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *