రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే

anakapalli mla peela govind
Spread the love

విశాఖ భూక‌బ్జాల భాగోతం కొత్త మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ త‌న కేసుల‌కు సంబంధించి పెద‌వి విప్పారు. తాను ఎటువంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డక‌పోయినా త‌న‌ను ఇరికంచార‌ని వాపోయారు. ఈ భూభాగోతం ఏకంగా తెలంగాణా టీడీపీ పెద్ద‌ల వ‌ర‌కూ విస్త‌రించి ఉందంటూ ఆయ‌న విస్మ‌య‌క‌ర విష‌యం వెల్ల‌డించారు. టీటీడీపీ నేత పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని విశాఖ‌లో భూ అక్ర‌మాలు సాగిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. తెలంగాణకు చెందిన వంశీ అనే వ్యక్తి తెరవెనుక ఉన్నారని పీలా గోవింద్ తెలిపారు. పెద్దిరెడ్డి పేరుతో ఆయ‌న వ్య‌వ‌హారాలు సాగాయ‌న్నారు. దాంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇన్నాళ్లుగా ఏపీ నేత‌ల‌కే ప‌రిమిత‌మైన దందాలు తెలంగాణా టీడీపీ నేత‌ల‌కు కూడా ముడిప‌డి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

తాను భూములు ఆక్రమించుకున్నట్టు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సవాల్‌ విసిరారు. తనకు సిట్‌ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి స్థలం ఇవ్వలేదనే కక్షతోనే తన తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. ఆర్డీవో వెంక‌టేశ్వ‌ర రావుపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. భూభాగోతాల‌కు ఆయ‌నే మూలంగా ఉన్నార‌న్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని, . విశాఖపట్నంలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో దర్యాప్తు చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా సిట్‌ దర్యాప్తు పూర్తిచేసి మంత్రి వర్గానికి నివేదిక సమర్పించాలని సూచించారు.


Related News

chinarajapp

రాజప్ప నియోజకవర్గంలో రాజీనామాలు

Spread the love7Sharesతెలుగుదేశం పార్టీలో పరిణామాలు మారుతున్నాయి. గడిచిన ఎన్నికల ముందు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప మరోసారిRead More

tdp

విద్యార్థిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Spread the love2Sharesసోషల్ మీడియా పోస్టుతో నేతల్లో మొదలవుతున్న అసహనం తీవ్రమవుతోంది. తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుRead More

 • తీవ్రవాయుగుండంతో వర్షాలు
 • వైసీపీలో వేడి రాజుకుంది..
 • ఏపీలోనూ డ్రగ్స్ కలకలం
 • ఆంధ్రా అల్లుడు-ఐర్లాండ్ ఆట‌గాడు
 • టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!
 • గంటాకు గంజాయితో ఝలక్ ఇచ్చిన అయ్యన్న
 • విద్యార్థుల కోసం జనసేనాని
 • మంత్రి గంటాకి అరెస్ట్ వారెంట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *