అయ్య‌య్యో.. అచ్చ‌న్న దొరికిపోయారు…!

51500630282_Unknown
Spread the love

ఏపీ మంత్రి అచ్చెన్న‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. తీవ్ర స్వ‌రంతో ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ల‌వ‌ర‌ప‌ర‌చ‌గ‌ల నైపుణ్యం ఆయ‌న‌ది. అయితేనేం అంత పెద్ద గొంతు ఉన్నా రాత‌లో మాత్రం దొరికిపోయారు. త‌న సొంత ఫేసుబుక్ వాల్ మీద చేసిన పోస్టుల‌తో అభాసుపాల‌య్యారు. దేశంలో కీల‌క నేత‌లెవ‌రెవ‌రో తెలియ‌కుండా కాంగ్రెస్ నాయ‌కురాల‌ని ప‌ట్టుకుని లోక్ స‌భ స్పీక‌ర్ వ‌ర్ణించ‌డం ఆయ‌న అభాసుపాలుకావ‌డానికి అవ‌కాశం ఇచ్చింది.

తాజాగా శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు వివాహ రిసెప్ష‌న్ ఢిల్లీలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌దాన‌మంత్రి , లోక్ స‌భ స్పీక‌ర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అయితే త‌న అన్న ఎర్ర‌న్నాయుడు కొడుకు రామ్మోహ‌న్ నాయుడు రిసెప్ష‌న్ లో పాల్గొన్న అచ్చెన్న దానికి సంబంధించిన ఫోటో ఒక‌టి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆస‌మ‌యంలోనే లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న స్థానంలో మాజీ ముఖ్య‌మంత్రి షీలాదీక్షిత్ పేరు ప్ర‌స్తావించి ఆయ‌న నెటిజ‌న్ల‌కు దొరికిపోయారు. దాంతో అచ్చెన్న మీద ప‌లువురు సోష‌ల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు.

అయితే టీడీపీ నేత‌లు వ‌రుస‌గా ఇలా దొరికిపోతున్న తీరు మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌క మాన‌దు. గ‌తంలో జ‌యంతిని వ‌ర్థంతి చేసి నారా లోకేష్, బీకాంలో ఫిజిక్స్ జ‌లీల్ ఖాన్ బాగా ఫేమస్ అయ్యారు. ఆ త‌ర్వాత ఒలింపిక్స్ విన్న‌ర్ కి నోబుల్ ప్రైజ్ ఇప్పిస్తానంటూ నోరుజారి చంద్ర‌బాబు కూడా అలానే చిక్క‌కున్నారు. ఇక ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆఖాతాలో చేరారు. మంత్రిగా ఉండి కూడా కేంద్రంలో కీల‌క‌ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తులెవ‌రెవ‌రో తెలియ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు.






Related News

chinarajapp

రాజప్ప నియోజకవర్గంలో రాజీనామాలు

Spread the loveతెలుగుదేశం పార్టీలో పరిణామాలు మారుతున్నాయి. గడిచిన ఎన్నికల ముందు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప మరోసారిRead More

tdp

విద్యార్థిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Spread the loveసోషల్ మీడియా పోస్టుతో నేతల్లో మొదలవుతున్న అసహనం తీవ్రమవుతోంది. తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుRead More

  • తీవ్రవాయుగుండంతో వర్షాలు
  • వైసీపీలో వేడి రాజుకుంది..
  • ఏపీలోనూ డ్రగ్స్ కలకలం
  • ఆంధ్రా అల్లుడు-ఐర్లాండ్ ఆట‌గాడు
  • టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!
  • గంటాకు గంజాయితో ఝలక్ ఇచ్చిన అయ్యన్న
  • విద్యార్థుల కోసం జనసేనాని
  • మంత్రి గంటాకి అరెస్ట్ వారెంట్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *