Main Menu

జ‌గ‌న్ కి కేసులు ఎప్పుడూ బ‌ల‌మే..!

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విప‌క్ష నేత జ‌గ‌న్ కేసులు రాజ‌కీయంగా కీల‌క‌పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ కేసుల కార‌ణంగా ఆయ‌న మీద అవినీతిప‌రుడ‌నే ముద్ర ఓ మేర‌కు బ‌ల‌ప‌డింది. తండ్రి అధికారంలో ఉండ‌గా పెద్ద స్థాయిలో అక్ర‌మాస్తులు పోగేశార‌నే అభిప్రాయం ప‌లువురిలో క‌లిగించ‌డంలో మీడియా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. అయితే సాధార‌ణ ప్ర‌జ‌ల్లో మాత్రం కేసులు క‌క్ష పూరిత‌మ‌ని, జ‌గ‌న్ ని వేధించ‌డం కోస‌మే పెడుతున్నార‌ని భావించే ప‌రిస్థితి ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ మీద కేసులు పెట్టిన వెంట‌నే జ‌రిగిన ఉప ఎన్నిక‌లు ఫ‌లితాన్నిచ్చాయి. 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేంది. గోదావ‌రి జిల్లాల్లో అయితే టీడీపీని థ‌ర్డ్ ప్లేస్ కి నెట్టేసింది.

ఇక తాజాగా మరోసారి జ‌గ‌న్ కేసులు ముందుకొస్తున్నాయి. జ‌గ‌న్ కేసుల‌తో పాటు ఏకంగా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ని కూడా భాగ‌స్వాముల‌ను చేస్తున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ భాగ‌స్వామిగా వైఎస్ భార‌తి స‌మ‌ర్థురాలైన కార్య‌నిర్వాహ‌కురాలిగా గుర్తింపు పొందారు. అటు మీడియా నిర్వ‌హ‌ణ బాధ్య‌తను అమె భుజ‌నా వేసుకున్నారు. ఆ త‌ర్వాత పిల్ల‌ల ఆల‌నాపాల‌నా తో పాటుగా ప‌లు వ్యాపార‌, కుటుంబ వ్య‌వ‌హారాల‌న్నీ ఆమె స్వ‌యంగా చూసుకుంటున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో పాటు నిత్యం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న త‌రుణంలో భార‌తిదే ఈ విష‌యంలో ప్ర‌ధాన పాత్ర‌. అలాంటి భార‌తికి ఇప్పుడు కేసుల‌లో కూడా భాగ‌స్వామ్యం ల‌భిస్తే అది రాజ‌కీయంగా మ‌రో చ‌ర్చ‌కు దారితీస్తుంది.

వాస్త‌వానికి భార‌తి రాజ‌కీయ‌ప‌రంగానూ గ‌డిచిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లు టీవీ చానెళ్ల ఇంట‌ర్య్యూల‌లో ఘాటు వ్యాఖ్య‌లు చేసేశారు. సూటిగా మాట్లాడుతూ చాలామందిని ఆక‌ట్టుకున్నారు. అయితే ఇప్ప‌టికే చంద్ర‌బాబు పేర్కొన్న‌ట్టుగా కాంగ్రెస్ ని వ్య‌తిరేకించారు కాబ‌ట్టి, వాళ్లు కోర్టుల ద్వారాజైలుకి పంపించిన విష‌యంలో ప‌లువురు గ్ర‌హించారు. ఇక ఇప్పుడు భార‌తిని కూడా అదే రీతిలో వేధిస్తున్నార‌ని ప్ర‌జ‌లు గ్ర‌హిస్తే మాత్రం రాజ‌కీయంగా మ‌రింత ప్ర‌భావితం చేస్తుంది. రాజ‌కీయంగా మ‌హిళ‌ను , అందులోనూ రాజ‌కీయంగా కొంత అవ‌గాహ‌న ఉన్న భార‌తి వంటి వారిని బ‌య‌ట‌కు లాగితే ప‌రిణామాలు మ‌రింత తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉంటుంది. బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌న్న ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌లు విక‌టించి జ‌గ‌న్ కుటుంబం ప‌ట్ల సానుభూతి మ‌రింత పెర‌గ‌డం అనివార్యం అవుతుంది. బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందం కుదుర్చుకున్నారంటూ, కేసుల కోసం కేంద్రం తో రాజీప‌డ్డారంటూ ఇన్నాళ్లుగా చేసిన ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని జ‌నాలు భావిస్తే మాత్రం బాబు ఎత్తుగ‌డ బూమ‌రాంగ్ అవుతుంద‌నే సందేహం కూడా మొద‌ల‌య్యింది. జ‌గ‌న్ కి మ‌రోసారి కేసులు బ‌లంగా మార‌తాయ‌న‌డంలో సందేహం లేదు.


Related News

కోర్టుకెళుతున్న చంద్ర‌బాబు!

Spread the loveఏపీ ముఖ్య‌మంత్రి కోర్టుకి హాజ‌రుకావాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. అందుకు తాముసిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించారు.Read More

చేతులెత్తేసిన చంద్ర‌బాబు!

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఓవైపు కాంగ్రెస్ తో క‌ల‌వ‌డానికి ఆయ‌న ఆస‌క్తి చూపుతున్న‌ట్టుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *