పార్టీలో గుర్తింపు లేదని ప్రాణం తీసుకునేందుకు…

trs
Spread the love

టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఓ నేత ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సాక్షాత్తు మంత్రి మహేందర్‌ రెడ్డి సమక్షంలో వికారాబాద్‌ జిల్లా తాండూరులో చోటుచేసుకుందీ ఘటన. పలువురు పార్టీ ప్రతినిధులు మాట్లాడుతుండగా, పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ వేదిక వద్దకు వెళ్లి మైక్‌ తీసుకున్నారు.

2004 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పార్టీ తరఫున తాను చురుగ్గా పాల్గొన్నానని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని, అయినా ఇప్పటివరకూ తనకు ఏ నామినేటెడ్‌ పదవీ ఇవ్వలేదన్నారు. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రసంగాన్ని ముగించి బయటికి వెళ్లిన ఖాన్‌ అప్పటికే వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. శరీరానికి అంటుకున్న మంటలతోనే అరుస్తూ సమావేశంలోకి వచ్చారు. కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఆయనకు ముఖం, ఛాతీ భాగాల్లో గాయాలయ్యాయి. మంత్రి ఆదేశాల మేరకు కార్యకర్తలు ఆయనను తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడితో సమావేశాన్ని రద్దు చేసిన మంత్రి వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.


Related News

chandrababu-ravanth-reddy-647x450

రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి

Spread the loveఅసమ్మతి గళం విప్పిన కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడుకు తెలంగాణ తెలుగుదేశం కళ్లెం వేసే ప్రయత్నం చేసింది.Read More

revanth reddy

రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు..

Spread the loveతెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోRead More

 • టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఖ‌రారు!
 • కేసీఆర్ స‌ర్కారుపై సుప్రీం సీరియ‌స్
 • టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే…
 • పార్టీలో గుర్తింపు లేదని ప్రాణం తీసుకునేందుకు…
 • రాబోయే రెండు రోజులు వర్షాలే..
 • కాటమరాయుడితో కత్తిమహేష్ తగాదా
 • గవర్నర్ విందులో కలిసిన కేసీఆర్ , బాబు
 • క‌విత‌కు డాషింగ్ బ్యాట్స్ మేన్ ప్ర‌శంస‌లు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *