రాబోయే రెండు రోజులు వర్షాలే..

rain_0
Spread the love

రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రమంతా భారీ వర్షాలు ఖాయమని వాతావరణ శాఖ చెబుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షపు హోరు ఖాయమని అంచనా వేస్తోంది. ఇప్పటికే ముంబై సగం నీట నానుతుండగా తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్షాల బెడద తప్పదని చెబుతోంది.ఇఫ్పటికే అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. ఫలితంగా తెలంగాణలోని చాలా చోట్ల ఇవాళ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. తర్వాతి నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ఇక కోస్తాంధ్రలో చాలా చోట్ల ఇవాళ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం సైతం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందనితెలిపారు. రానున్న రెండు, మూడు రోజులు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


Related News

chandrababu-ravanth-reddy-647x450

రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి

Spread the loveఅసమ్మతి గళం విప్పిన కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడుకు తెలంగాణ తెలుగుదేశం కళ్లెం వేసే ప్రయత్నం చేసింది.Read More

revanth reddy

రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు..

Spread the loveతెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోRead More

 • టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఖ‌రారు!
 • కేసీఆర్ స‌ర్కారుపై సుప్రీం సీరియ‌స్
 • టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే…
 • పార్టీలో గుర్తింపు లేదని ప్రాణం తీసుకునేందుకు…
 • రాబోయే రెండు రోజులు వర్షాలే..
 • కాటమరాయుడితో కత్తిమహేష్ తగాదా
 • గవర్నర్ విందులో కలిసిన కేసీఆర్ , బాబు
 • క‌విత‌కు డాషింగ్ బ్యాట్స్ మేన్ ప్ర‌శంస‌లు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *