కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టో..

pawan kcr
Spread the love

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాజ్‌భవన్‌లో గౌరవ విందు ఏర్పాటు చేశారు. శీతాకాల విడిదిలో భాగంగా నాలుగురోజుల భాగ్యనగర పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు సహా ప్రతిపక్ష నాయకులతొ పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో జరుగుతున్న వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పలకరించుకున్నారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

విభజనం సమయంలో ఇద్దరి మధ్య విమర్శల పర్వం ఏ స్థాయిలో సాగిందో అందరికీ తెలిసిందే. జనసేన స్థాపించిన తరువాత కూడా కేసీఆర్.. పవన్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో పవన్ పార్టీకి 1 శాతం ఓట్లు కూడా రావంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. దానిపైనా పవన్ తనదైన రీతితో ప్రతిస్పందించారు. నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య సృహృద్భావ వాతావరణం కనిపించిన దాఖలాలు లేవు. కానీ నేడు రాజ్‌భవన్‌లో జరిగిన విందులో ఇద్దరూ క్లోజ్ గా మూవ్ గా చర్చనీయాంశం అయ్యింది. అందరినీ ఆకర్షించింది. అదే సమయంలో చంద్రబాబుతో కేసీఆర్ కూడా కొంతసేపు ఏకాంతంగా చర్చలు జరపడం విశేషం.


Related News

mahesh kathi

ఐలవ్యూ మెసేజ్ వివాదంలో కత్తి మహేష్

Spread the love6Sharesపవన్ ఫ్యాన్స్ తో తగాదా పెట్టుకుని కీర్తి గడించిన క్రిటిక్ కత్తి మహేష్ తాజా ఆరోపణల్లో ఇరుక్కున్నారు.Read More

gazals

ఇరుక్కున్న గజల్స్ శ్రీనివాస్

Spread the love2Sharesఓ యువతిని బలవంతంగా వేదించిన లైంగిక వేధింపుల కేసులో గజల్స్ శ్రీనివాస్ ఇరుక్కున్నారు. అసభ్యంగా ప్రవర్తించి, ముద్దులుRead More

 • కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టో..
 • రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి
 • రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు..
 • టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఖ‌రారు!
 • కేసీఆర్ స‌ర్కారుపై సుప్రీం సీరియ‌స్
 • టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే…
 • పార్టీలో గుర్తింపు లేదని ప్రాణం తీసుకునేందుకు…
 • రాబోయే రెండు రోజులు వర్షాలే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *